Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్‌గాంధీ హర్యానా టూర్‌పై సర్వత్రా ఉత్కంఠ

Rahulgandhi

Rahulgandhi

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ హర్యానా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ బోల్తా పడింది. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయగా.. తీరా రిజల్ట్ సమయానికి అంచనాలన్నీ తారుమారయ్యాయి. మరోసారి బీజేపీ అధికారాన్ని ఛేజిక్కించుకుంది.

ఇది కూడా చదవండి: Kamareddy: నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతైన ముగ్గురు యువకుల కోసం గాలింపు..

అయితే ఇప్పటివరకు ఓటమిపై ఆ పార్టీ నేతలు విశ్లేషించుకోలేదు. అంతమాత్రమే కాకుండా 37 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్.. ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడిని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యకరం. ఇక పార్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందంటూ కార్యకర్తల గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న విభేదాలతోనే ప్రజలు.. మరోసారి బీజేపీకి అధికారం కట్టబెట్టారని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు, పంజాబ్‌ అమీతుమీ.. తొలి కల తీరేదెవరిదో!

ఇలాంటి సమయంలో జూన్ 4న (బుధవారం) రాహుల్‌గాంధీ హర్యానాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది. ఈ పర్యటనలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్ర యూనిట్‌ను కూడా ప్రకటించనున్నారు. ఇక పార్టీలో సీనియర్ల మధ్య నెలకొన్న అంతర్గత కలహాలను రాహుల్‌గాంధీ ఎలా పరిష్కరిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా ఆసక్తిరేపుతోంది.

ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, పీసీసీ చీఫ్ ఉదయ్ ఖాన్, రాజ్యసభ ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా, రోహతక్‌ ఎంపీ దీపేందర్ హుడా పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అలాగే సీఎల్పీ నాయకుడిని కూడా ఎంపిక చేసే ఛాన్సుంది. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యే అంశం అయితే ప్రస్తుతం ఎజెండాలో లేదని వర్గాలు తెలిపాయి. ఒక్కరోజు పర్యటనలో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టడం, మరొకటి జిల్లా అధ్యక్షుల ఎంపిక మరియు జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా అంతర్గత కలహాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

Exit mobile version