Rahul Gandhi Fire On EC: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని రిలీజ్ చేయాని విపక్షాలు గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ఇవాళ (జూన్ 21న) కీలక ప్రకటన చేసింది. ఓటింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లను బహిరంగ పేర్చలేమని తేల్చి చెప్పింది. అలాంటి వీడియో కంటెంట్‌ను షేర్ చేయడం వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని పేర్కొనింది. అంతేగాక, ప్రజాస్వామ్య ప్రక్రియకు సైతం ప్రమాదం వాటిల్లుతుందని తెలిపింది. సీసీ ఫుటేజీని విడుదల చేయాలనే డిమాండ్లు పారదర్శకతను ప్రోత్సహించేలా ఉన్నప్పటికీ, అవి ప్రతికూలమైవని, చట్టబద్ధంగా కుదరదని చెప్పుకొచ్చింది ఈసీ.
Read Also: Hyderabad: ఉరేసుకుని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య.. ఎందుకంటే..?
అయితే, సీసీ ఫుటేజీని బహిర్గతం చేయడమంటే.. 1950, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు సుప్రీంకోర్టు సూచనలను ఉల్లంఘించడమే అవుతుందని ఎన్నికల సంఘం చెప్పుకొచ్చింది. ఇక, ఈసీ ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. సమాధానాలు చెప్పాల్సిన వాళ్లే ఆధారాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపాం.. ఓటరు లిస్టు? దానిని మెషిన్-రీడబుల్ ఫార్మాట్‌లో అందించరు.. సీసీ ఫుటేజ్ దాచడానికి చట్టంలో మార్పులు చేశారు.. ఎన్నికల ఫోటోలు, వీడియోలు ఏడాది పాటు ఉంచే బదులు వాటిని కేవలం 45 రోజుల్లోనే తొలగిస్తారని తెలిపారు. దీని ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు క్లియర్ గా తెలుస్తుందని విమర్శలు గుప్పించారు.