Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్‌లో ఫొటోలు పోస్ట్
- నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు
- ఎక్స్‌లో ఫొటోలు పోస్ట్
- ప్రధాని మోడీపై ప్రతిపక్ష నేత విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ పరీక్ష రద్దు కారణంగా ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలిసి ఓదార్చారు. బాధితులకు సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తల్లిదండ్రులకు తమ బిడ్డను కోల్పోవడం కంటే బాధాకరమైనది మరొకటి ఉండదని రాశారు. పరీక్షా విధానంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తి, ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
‘‘ప్రతి యువకుడి మరణం వెనుక తీరని బాధతో ఉండే ఒక కుటుంబం ఉంటుంది. ఇది మన విచ్ఛిన్నమైన విద్యా వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. పరీక్షలు రద్దవుతున్నాయి. సంవత్సరాల తరబడి చేసిన కృషి రాత్రికి రాత్రే నాశనమవుతోంది. మన విద్యార్థులను నిజాయితీగా కష్టపడమని చెబుతారు. కానీ వారు పనిచేస్తున్న వ్యవస్థే వారితో నిజాయితీగా లేదు.’’ అని పేర్కొన్నారు.
Also Read
- Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
- Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌పై ఫిర్యాదు.. రాహుల్‌గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
- Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
- Kulgam: కుల్గామ్‌లో పహల్గామ్ సీన్ రిపీట్.. హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి!
పేపర్ లీక్ కారణంగా తమ పిల్లలను కోల్పోయిన ఏ తల్లిదండ్రులనూ మోడీ కలవలేదని.. భవిష్యత్తు నాశనమైన ఏ విద్యార్థులతోనూ ఆయన కూర్చోలేదని అన్నారు. భారతదేశ విద్యార్థులకు ప్రధానమంత్రి క్షమాపణ అవసరం లేదని.. పైగా ప్రధానమంత్రే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీళ్లు, విలాపాల కన్నా గొప్ప దుఃఖం మరొకటి ఉండదని అన్నారు. ఈ దుఃఖం శాశ్వతంగా వెంటాడుతుందని.. దానితో పాటు ఈ విచ్ఛిన్నమైన, అవినీతిమయమైన విద్యా వ్యవస్థపై అనేక ప్రశ్నలు మిగిలిపోతాయని పేర్కొన్నారు. పేపర్ లీక్‌లు, పరీక్షల రద్దు, సంవత్సరాల తరబడి చేసిన కృషి క్షణాల్లో వృధా అవుతున్నప్పటికీ, విద్యార్థులను నిజాయితీగా పనిచేయమని అడుగుతున్నారని, కానీ వారు పనిచేస్తున్న వ్యవస్థే నిజాయితీగా లేదని అన్నారు. అయినప్పటికీ ప్రధానమంత్రి విద్యార్థులను ‘క్షమించడం’ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Nothing is more painful than seeing a parent grieve their child.
Behind every young life lost is a family carrying pain that will never leave them – and serious questions about a broken education system.
Leaked papers. Cancelled exams. Years of preparation destroyed overnight.… pic.twitter.com/nzQE61zP14
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్‌లో ఫొటోలు పోస్ట్
-
Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
-
Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌పై ఫిర్యాదు.. రాహుల్‌గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
-
Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.!
-
Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్‌బై!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!