Rahul Gandhi: పార్లమెంట్ ముందు ఇండియా కూటమి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంటులోకి ప్రవేశించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కారు దిగిన వెంటనే, కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులు గులాబీ పువ్వుతో పాటు త్రివర్ణ పతాకాన్ని అందజేశారు.
Read Also: Manchu Manoj: జల్‌పల్లి నివాసం ముందు మీడియా ప్రతినిధుల ఆందోళన.. మద్దతు తెలిపిన మనోజ్
ఇక, అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన లంచం ఆరోపణలపై చర్చలను కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపిస్తూ పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, నవంబర్ 20వ తేదీ పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభలు ఈ సమస్యపై నిరంతరం ఆందోళన చేయడంతో.. సభకు అంతరాయం కలుగుతుంది. మరోవైపు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జార్జ్ సోరోస్‌తో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. కాగా, ఇప్పటికే రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను తొలగించడానికి తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్ష ఇండియా బ్లాక్ పార్టీలు నోటీసు సమర్పించాయి. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.
#WATCH | Delhi | In a unique protest in Parliament premises, Congress MP and LoP Lok Sabha, Rahul Gandhi gives a Rose flower and Tiranga to Defence Minister Rajnath Singh pic.twitter.com/9GlGIvh3Yz
— ANI (@ANI) December 11, 2024