Tamil Nadu: ‘‘రాహుల్ గాంధీ మాకు బూస్ట్, హార్లిక్స్ ఇస్తున్నారు’’.. విజయ్ తండ్రి ప్రతిపాదనపై కాంగ్రెస్..
- కాంగ్రెస్‌కు గత వైభవం రావాలంటే మాతో చేరండి..
- హస్తం పార్టీకి విజయ్ తండ్రి ప్రతిపాదన..
- ‘‘రాహుల్ గాంధీనే మాకు హార్లిక్స్, బూస్ట్ ఇస్తున్నారు’’
- ప్రతిపాదనను తిరస్కరించిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదిలా ఉంటే, ఈ సారి స్టార్ యాక్టర్ విజయ్ తన పార్టీ టీవీకేతో బరిలో దిగుతుండటంతో రాష్ట్రంలో ముక్కోణపు పోటీ నెలకొంది. దీంతో పొత్తులపై అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే, విజయ్ పార్టీకి కాంగ్రెస్‌తో పొత్తు కుదురుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Also: AP Government: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారికి ఉచిత విద్యుత్.. పెన్షన్ పెంపు..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఆహ్వానం వచ్చింది. టీవీకేతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్‌ను విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ కోరారు. తిరువారూర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని, ఈ అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకోవద్దని సూచించారు. కాంగ్రెస్‌కు గొప్ప చరిత్ర ఉందని, విజయ్ వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ అవకాశాన్ని తీసుకుని కాంగ్రెసన్ తన పాత గౌరవాన్ని పొందాలని, ఇప్పుడు నిర్ణయం కాంగ్రెస్ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై టీవీకే కానీ, విజయ్ కానీ అధికారికంగా స్పందించలేదు.
ఇదిలా ఉంటే ఈ ప్రస్తావనపై కాంగ్రెస్ తమిళనాడు చీఫ్ కే సెల్వపెరుంతగై స్పందించారు. ‘‘మా కార్యకర్తలకు ఎలాంటి బూస్ట్ అవసరం లేదు. మా నాయకుడు రాహుల్ గాంధీ మాకు బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌వీటా అన్నీ ఇస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఇప్పటికే ఉత్సాహం ఉందని, బయట నుంచి మద్దతు అవసరం లేని చెప్పారు. కాంగ్రెస్, తమిళనాడులో అధికార పార్టీ డీఎంకేతో పొత్తులో ఉంది. ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతోంది. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తులో కొనసాగాయి.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!