Rahul Gandhi Comeents on National Language: జాతీయ భాషగా హిందీ అనే వివాదంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల ప్రజలు హిందీని తమపై రుద్దదంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రజలతో పాటు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హిందీని జాతీయభాషగా ప్రాంతీయ భాషలపై రద్దువద్దని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే జాతీయ భాషగా హిందీ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం భారత్ జోడో యాత్రలో భాగంగా పలు విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. హిందీ మాత్రమే జాతీయ భాషగా మార్చే ఉద్దేశ్యం లేదని ఆయన అన్నారు. కన్నడ వంటి ప్రాంతీయ బాషల ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు. కన్నడ గుర్తింపుపై రాహుల్ గాంధీతో చర్చ జరిగింది. అందరి మాతృ భాష ముఖ్యమని.. అన్ని భాషలను గౌరవిస్తాం.. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికి హక్కు ఉందని పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. హిందీని మాత్రమే జాతీయ భాషగా చేసి కన్నడ గుర్తింపును బెదిరించే ఉద్దేశ్యం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా సెల్ ఇంఛార్జ్ అయిన ప్రియాంక్ ఖర్గే అన్నారు.
అయితే రాహుల్ గాంధీతో సమావేశం అయిన తమకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని.. రాజ్యాంగాన్ని కాపాడే యాత్రలో పాల్గొంటున్నామని చెప్పారు ఉపాధ్యాయులు, విద్యాసంస్థల ప్రతినిధులు. ఏఐసీసీ రిసెర్చ్ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజీవ్ గౌడ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వంటి అన్ని విషయాలపై, విద్యారంగ సమస్యలపై రాహుల్ గాంధీతో చర్చించారని అన్నారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం అయింది. తమిళనాడు, కేరళలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసిన తర్వాత ప్రస్తుతం కర్ణాటక మాండ్యా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర జరగనుంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.