మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారత్‌లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే అని పేర్కొన్నారు. అలాగే, సామాజిక ఐక్యత, సామరస్యం కోసం కులమతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలన్నారు.
తమిళనాడులో హిందీ భాష మరోసారి వివాదంగా మారింది. గోవా విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది, హిందీ రాకపోవడంతో ఓ తమిళ యువతిపై అనుచితంగా ప్రవర్తించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. హిందీ భారతదేశ జాతీయభాష కాదని, ప్రజలు బలవంతంగా దీనిని నమ్మేలా చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
Rahul Gandhi Comeents on National Language: జాతీయ భాషగా హిందీ అనే వివాదంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల ప్రజలు హిందీని తమపై రుద్దదంటన్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రజలతో పాటు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హిందీని జాతీయభాషగా ప్రాంతీయ భాషలపై రద్దువద్దని సూచిస్తున్నారు.
అజయ్ దేవగన్, సుదీప్ మధ్య కొనసాగుతున్న జాతీయ భాషా వివాదంపై ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ స్పందించారు. ఈ విషయమై సోనూ మాట్లాడుతూ ‘హిందీ మన జాతీయ భాష అని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. అది ఎక్కువగా మాట్లాడే భాష కావచ్చు. కానీ జాతీయ భాష కాదు. నిజానికి తమిళం చాలా పురాతన భాష. సంస్కృతం, తమిళం మధ్య ఈ విషయమై చర్చ జరుగుతోంది. అయితే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాష తమిళం అంటున్నారు’ అని చెప్పాడు.…