Site icon NTV Telugu

Sam Pitroda: ‘‘పాకిస్తాన్ వెళ్లాను, ఇంట్లో ఉన్నట్లు ఉంది’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడు..

Sam Pitroda

Sam Pitroda

Sam Pitroda: కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా భావించే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో రాజకీయ రచ్చకు కారణమైంది. పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. పాకిస్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రారంభం కావాలని పిట్రోడా అన్నారు.

Read Also: Pakistan – China: ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు ఎదురుదెబ్బ.. చైనాకు తప్పని భంగపాటు

‘‘నా అభిప్రాయం ప్రకారం, మన విదేశాంగ విధానం మొదట మన పొరుగు దేశాలపై దృష్టి పెట్టాలి. మన పొరుగువారితో చర్చలను మనం నిజంగా గణనీయంగా మెరుగుపరచుకోగలమా?, నేను పాకిస్తాన్‌కు వెళ్లాను, అక్కడ నేను ఇంట్లో ఉన్నట్లు భావించాను. నేను బంగ్లాదేశ్‌కు వెళ్లాను, నేపాల్‌కు వెళ్లాను, ఈ దేశాల్లో నేను ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నాను. నాకు విదేశాల్లో ఉన్నట్లు అనిపించడం లేదు.’’ పిట్రోడా అని అన్నారు.

పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ భారతదేశ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. ‘‘రాహుల్ గాంధీకి చాలా ఇష్టమైన వ్యక్తి, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడా పాకిస్తాన్‌లో ఉంటే తన ఇంట్లో ఉన్నట్లే భావిస్తున్నాడు. అందుకు 26/11 ముంబై దాడుల తర్వాత కూడా యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌పై ఎలాంటి కఠిన చర్యల తీసుకోలేదేమో. పాకిస్తాన్‌కు ఇష్టమైన పార్టీ కాంగ్రెస్ ’’ అంటూ బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version