Sam Pitroda: కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా భావించే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో రాజకీయ రచ్చకు కారణమైంది. పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. పాకిస్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రారంభం కావాలని పిట్రోడా అన్నారు.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము సపోర్టు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. అయితే, చర్చల పరిధి, స్వభావం, వాటి కాలపరిమితిని ఇరు దేశాలే నిర్ణయించుకోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పుకొచ్చారు.