విమాన ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో చేదు అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ముఖ్యంగా సామాను బరువు కొంచెం పెరిగినా అదనపు చార్జీలు వసూలు చేసే ఎయిర్‌లైన్స్, విమానం గంటల కొద్దీ ఆలస్యమైనప్పుడు మాత్రం ప్రయాణీకులకు ఎందుకు సమాధానం చెప్పవు? ఇదే అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటు వేదికగా ప్రశ్నించారు.
HIV: HIV చికిత్సలో కీలక ముందడుగు.. చైనా సైంటిస్టుల ఘన విజయం..
పార్లమెంటులో రాఘవ్ చద్దా మాట్లాడుతూ, ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను ఎండగట్టారు. “ప్రయాణీకుల బ్యాగ్ కేవలం ఒక కిలో ఎక్కువ బరువు ఉన్నా ఎయిర్‌లైన్స్ వెంటనే అదనపు డబ్బులు వసూలు చేస్తాయి. కానీ అదే విమానం 3 గంటలు ఆలస్యంగా వచ్చినప్పుడు ఎయిర్‌లైన్స్ ఎందుకు మౌనంగా ఉంటాయి? ప్రయాణీకుల సమయానికి విలువ లేదా?” అని ఆయన నిలదీశారు. ప్రయాణీకులకు కలిగే ఇబ్బందులకు ఎయిర్‌లైన్స్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రతి ప్రయాణీకుడు ఆలోచించే ఈ నిజమైన ప్రశ్న పార్లమెంటులో ప్రతిధ్వనించింది. విమానయాన సంస్థలు తమ సేవల్లో లోపాలు ఉన్నప్పుడు ప్రయాణీకులకు తగిన పరిహారం లేదా ప్రత్యామ్నాయ వసతులు కల్పించేలా నిబంధనలు మరింత కఠినతరం కావాల్సిన అవసరం ఉందని ఈ చర్చ ద్వారా స్పష్టమైంది.