Radhamohan Mishra: తానే దేవుడి స్వరూపమని చెప్పుకుంటూ.. మహిళను ఏళ్ల తరబడి హింసించి అత్యాచారం.. మూత్రం తాగాలని బలవంతం
- నకిలీ బాబా దారుణం
- 15 ఏళ్లుగా మహిళపై అత్యాచారం, చిత్రహింసలు
- మహిళ ఫిర్యాదుతో అసలు నిజాలు బయటపడ్డాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని పుణేలో ఒక స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు (గాడ్‌మ్యాన్) చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. రాధామోహన్ మిశ్రా అనే వ్యక్తి తనకు దైవిక శక్తులు ఉన్నాయని నమ్మించి, ఓ మహిళను దాదాపు 15 సంవత్సరాల పాటు లైంగికంగా, శారీరకంగా, మానసికంగా వేధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అతనితో పాటు ఏడుగురు సహచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆరోగ్య, కుటుంబ సమస్యలను పరిష్కరిస్తానని నమ్మబలికి ఆమెను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, విద్యుత్ షాక్‌లు ఇవ్వడం, తన మూత్రం తాగాలని బలవంతం చేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, మహిళను తన భర్తకు దూరం చేయడం, ఆస్తులను తన పేరుకు బదిలీ చేయించాలని ఒత్తిడి చేయడం, కుటుంబ సభ్యుల నుంచి వేరుచేసి పూర్తిగా తన నియంత్రణలో ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆశ్రమంలో సీసీటీవీ నిఘా, కఠిన నియంత్రణ వ్యవస్థల ద్వారా ఆమెపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
చివరకు మహిళ ఆశ్రమం నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆశ్రమంలో సోదాలు నిర్వహించి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు, నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!