Rafale fighter jets: ఆపరేషన్ సిందూర్‌లో అసలైన హీరో ‘‘రాఫెల్ జెట్స్’’..
- ఆపరేషన్ సిందూర్‌లో రియల్ హీరో ‘‘రాఫెల్ జెట్స్’’..
- ప్రతీ ఉగ్రవాద దాడికి మూల్యం చెల్లించుకోవాల్సిందే అని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rafale fighter jets: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫైటర్ జెట్లు అద్భుతంగా పనిచేశాయని, మొత్తం ఆపరేషన్‌లో రాఫెట్ ఫైటర్ జెట్‌లు ‘‘హీరో’’ అని భారత ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ బుధవారం అన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరిన్ని మల్టీ రోల్ ఫైటర్ జెట్లను చేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకుందని ఆయన చెప్పారు.
Read Also: Rahul Gandhi: రాహుల్‌గాంధీపై కేంద్రం సంచలన నిర్ణయం..
Also Read
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
ఎక్సర్‌సైజ్ వాయుశక్తి 2026 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రతీ ఉగ్రవాద చర్యకు ప్రతిస్పందిస్తామని ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ అన్నారు. “ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ ఖచ్చితంగా హీరో. భారత వైమానిక దళం మల్టీరోల్ ఫైటర్ జెట్లను చేర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఇవి రాఫెల్ లేదా మరేదైనా కావచ్చు, ఇవి చర్చల్లో ఉన్నాయి, ఇంకా నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేదు.” అని ఆయన అన్నారు. భారత్‌పై జరిగే ఏ ఉగ్రవాద దాడికైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. భారత్ ఫ్రాన్స్‌తో 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ డీల్ కుదుర్చుకోబోతోందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
గతేడాది భారత్‌పై లష్కరే తోయిబా ఉగ్రసంస్థ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో పర్యాటకుల్ని టార్గెట్ చేసి 26 మందిని చంపేసింది. దీని తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ సైన్యం దాడులకు ప్రయత్నిస్తే, భారత్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. రాఫెల్ జెట్‌లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను ఉపయోగించి పాక్‌లో విధ్వంసం సృష్టించింది.
తాజావార్తలు
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!