Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- మహిళలపై ఆగని అకృత్యాలు
- పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య
- కాలువలో శవం లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అకృత్యాలు, ఘోరాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట అబలలు మృగాళ్ల చేతిలో బలైపోతున్నారు. ఈ మధ్య వరుసగా వరకట్న పిశాచికి గృహిణిలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దారుణాలను మరువక ముందే.. తాజాగా పంజాబ్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పంజాబీ గాయని ఇందర్ కౌర్ దారుణ హత్యకు గురైంది. పెళ్లికి అంగీకరించలేదని ఓ మృగాడు అత్యంత దారుణంగా చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఇందర్ కౌర్.. ప్రముఖ పంజాబ్ గాయని. మోగాలోని భలూర్ గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు. కానీ అందుకు ఇందర్ కౌర్ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో సుఖ్వీందర్ సింగ్ పగ పెంచుకున్నాడు. ఈ నెల 13న రాత్రి 8:30 గంటలకు కారులో సరుకులు తేవడానికి ఇందర్ కౌర్ బయటకు వెళ్లింది. రాత్రి పొద్దుపోయే వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో బాధిత కుటుంబం సుఖ్వీందర్ సింగ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. కెనడా నుంచి పంజాబ్‌కు వచ్చి కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి అనుమానం నిజమైంది. ఇందర్ కౌర్‌ను చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం నిందితుడు కెనడాకు పారిపోయాడు.
Also Read
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
ఇక మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందంటూ తల్లిదండ్రులు భోరన విలపించారు. మే 15న సుఖ్వీందర్ సింగ్, అతని సహచరుడు కరమ్‌జిత్ సింగ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. సకాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయని జమాల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బల్బీర్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!