Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
- మహారాష్ట్రలోని పూణెలో ఘోరం
- కాబోయే భర్తను పైకి పంపేసిన యువతి
- మరో 5 నెలల్లో ఉధయ్పూర్లో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి యువత ఎటువైపు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి కొలది ఆలోచనలు కూడా కొత్త పొంతలు తొక్కుతున్నాయి. వివాహ వ్యవస్థపైన అవగాహన లేకనో.. లేదంటే తప్పుడు కోరికల వలనో తెలియదు గానీ.. తమ సుఖం కోసం అడ్డు తొలగించుకునేందుకు హత్యలకు కూడా వెనుకాడడం లేదు. గతేడాది మేఘాలయకు హనీమూన్‌కు తీసుకెళ్లి కట్టుకున్న భర్తనే సోనమ్ రఘువంశీ అనే నవవధువు చంపేసిన ఘటన అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో పెళ్లికాకముందే కాబోయే భర్తను పైకి పంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
మహారాష్ట్రలోని పుణెలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించిన ట్రెక్కర్ కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసు.. ఇప్పుడు హత్య కేసుగా మారింది. కాబోయే భార్య, ఆమె స్నేహితుడు కలిసి కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లుగా పోలీసులు కనిపెట్టారు. దీంతో ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా భావించిన కుటుంబ సభ్యులు.. ఇప్పుడు అసలు విషయం తెలిసి హతాశులయ్యారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
పోలీసుల వివరాల ప్రకారం.. 26 ఏళ్ల కేతన్ విశాల్ అగర్వాల్ పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందినవాడు. తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 18న తన కాబోయే భార్య పుట్టినరోజు వేడుకల కోసం ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులతో కలిసి చారిత్రాత్మక ప్రాంతమైన లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. అయితే ఆ సమయంలో కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు పడిపోయినట్లుగా కాబోయే భార్య చెప్పడంతో పోలీసులు నమ్మి లైట్ తీసుకున్నారు. కేతన్ ఫోటోలు తీసుకుంటున్న సమయంలో బలమైన గాలుల కారణంగా సమతుల్యత కోల్పోయి సుమారు 400 అడుగుల లోతైన లోయలో పడిపోయాడని చెప్పడంతో నమ్మేశారు. దీంతో ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.
అయితే తాజాగా దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాబోయే భార్యను లోతుగా విచారించడంతో సమాధానాలు తికమకగా చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానాలు రేకెత్తాయి. మరింత లోతుగా దర్యాప్తు చేయగా బండారం బయటపడింది. కాబోయే భార్య, ఆమె స్నేహితుడు కలిసి కేతన్‌ను ఉద్దేశపూర్వకంగానే లోయలోకి తోసివేసి, దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కోణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు మహారాష్ట్రలో తీవ్ర సంచలనంగా మారగా.. ప్రేమ, పెళ్లి, విశ్వాసం పేరుతో జరిగిన ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరోవైపు కేతన్ వివాహం ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సి ఉంది. ఇందుకోసం కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక రాజభవనాన్ని వివాహ వేడుకల కోసం బుక్ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లికి కొన్ని నెలల ముందు చోటుచేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చరిత్ర ప్రసిద్ధి చెందిన లోహగడ్ కోట, ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రతో ముడిపడి ఉంది. ఇది మహారాష్ట్రలోని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న 12 కోటల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?