2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2027 సంక్రాంతి రేసులోకి ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు జాయిన్ అయిపోతున్నారు. ఆల్రెడీ కర్చీఫ్ వేసిన వాళ్లు జారుకుంటున్నారు. ఎంతమంది డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. మనవాళ్లకే ప్లేస్ లేదు, థియేటర్స్ దొరకవు అనుకుంటే తమిళ స్టార్స్ ‘మేము సైతం’ అంటూ వచ్చేస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ కర్చీఫ్ వేసేస్తారు. ఇలా ఓ అరడజను సినిమాలు పోటీపడుతున్నాయి. థియేటర్స్ దొరుకుతాయా అన్న డౌట్ వస్తుంది. తీరా సంక్రాంతికి వచ్చేసరికి మూడు, నాలుగు సినిమాలే ఉంటాయి. ఇది ప్రతి ఏడాది కామన్ అయినా, వచ్చే సంక్రాంతికి తమిళనాడు నుంచి రజినీకాంత్, సూర్య కూడా బరిలోకి దిగుతున్నారు.
2027 సంక్రాంతికి నలుగురు సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు వస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నాగార్జున తప్పుకున్నట్టు తెలుస్తోంది. 2016 సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సీక్వెల్ ‘బంగార్రాజు’ కూడా ఇదే పండగకి 2022లో వచ్చి హిట్ అయింది. థర్డ్ పార్ట్ 2027 జనవరి 15న రిలీజ్ అంటూ విడుదల తేదీ కూడా ప్రకటించారు. అయితే నాగ్ ఆరు నెలలుగా నటిస్తున్న 100వ సినిమానే పూర్తి కాలేదు. ఈ లెక్కన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ పార్ట్-3తో సంక్రాంతికి రావడం కష్టమే.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి మరోసారి బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆ మధ్య పొల్లాచ్చిలో మొదలై ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెంటిమెంట్ రీత్యా సంక్రాంతికే రావాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నాడట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సంక్రాంతికి వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ హిట్ కావడంతో కొత్త సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలనుకుంటున్నాడు మెగాస్టార్.
బాలకృష్ణ, గోపీచంద్ మాలినేనిని కూడా సంక్రాంతి సెంటిమెంట్ వెంటాడుతోంది. సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’ హిట్ కావడంతో మరోసారి ఇదే పండగకి వద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందనుకుంటే డిసెంబర్ కి రిలీజ్ చేస్తారట. ప్రతి సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు, ఒకటి రెండు చిన్న సినిమాలు విడుదలకి చోటు ఉంటుంది. జనవరి 11 నుంచి 15 వరకు రోజుకో సినిమా థియేటర్స్ లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతికి రావాలన్న పట్టుదలతో ఉన్నా, ఒక్కోసారి సిచువేషన్స్ సహకరించవు. పండగకి వచ్చే సినిమాలు ఏంటో జనవరి ఫస్ట్ వీక్ లో తేలనుంది.
ఎవరు వచ్చినా రాకపోయినా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ రావడం గ్యారెంటీ. సంక్రాంతికే వస్తామన్న ప్రతిసారి మాట నిలబెట్టుకొని సూపర్ హిట్స్ కొడుతున్నాడు అనిల్. ‘ఎఫ్2’, ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్స్ తో వచ్చిన ‘సంక్రాంతి డైరెక్టర్’ పేరును మిస్ చేసుకునే ఉద్దేశం అనిల్ కు ఏమాత్రం లేదు. సంక్రాంతికే వస్తున్నామంటూ ప్రమోషన్ కూడా మొదలుపెట్టేసాడు.
మన స్టార్స్ కే చోటు లేదనుకుంటే, ఈ హెవీ కాంపిటీషన్ లోకి రజినీకాంత్ కూడా దిగుతున్నారు. రజిని, దర్శకుడు సిబి చక్రవర్తి కాంబోలో కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాను 2027 పొంగల్ కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రజినీకాంత్ సినిమా అంటే తెలుగులో రిలీజ్ కావడం ఖాయం. ఈసారి థియేటర్స్ ను అందరికీ సర్దటం అంత ఈజీ కాదు.
‘వీరభద్రుడు’తో ఫామ్ లోకి రావడమే కాదు, ఫస్ట్ టైం 300 కోట్ల మార్కు దాటిన సూర్య కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు. ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ యాక్షన్ కామెడీ మూవీ సంక్రాంతికి బరిలో దిగనుంది. శివకార్తికేయన్ సినిమా కూడా ఇదే రేసులో ఉంది. రజినీకాంత్, సూర్య, శివకార్తికేయన్ లలో ఎవరో ఒకరు తగ్గినా, మిగతా ఇద్దరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కావాలి. మనలో మనకి కాంపిటీషన్ ఎక్కువైంది అనుకుంటే మధ్యలో తంబీలు వస్తున్నారు. ఏదైనా 2027 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ మాత్రం మామూలుగా ఉండదు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!