Ketan Agarwal Case: కేతన్ ముందే అనుమానించాడు, కానీ సియా నటన ముందు ఓడిపోయాడు..
- సంచనలంగా కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు..
- నమ్మించి, ప్రేమ నటించి చంపేసిన సియా..
- కేతన్ అనుమానించినా, ఆమె నటన ముందు ఓడిపోయారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ హత్య దేశంలో సంచలనంగా మారింది. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి సియా గోయల్ అత్యంత దారుణంగా కుట్ర పన్ని హత్య చేసింది. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సియా, ఆమె ప్రియుడు చేతన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం, తన పుట్టిన రోజు అని చెప్పి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసింది. దీనిపై కేతన్ తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకును సియానే బలవంతంగా కోటకు తీసుకెళ్లిందని, ఒక వేళ వెళ్లకపోతే తన కొడుకు బ్రతికుండే వాడని కన్నీరు పెట్టుకున్నారు.
జూన్ 18న ఉదయం సుమారు 8.20 గంటలకు ,ఇద్దరూ లోహగఢ్ కోటకు బయలుదేరారు. ఉదయం 10.45 గంటలకు సియా తల్లి ఫోన్ చేసి, కేతన్ లోయలో పడిపోయారని చెప్పింది. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే లోపే కేతన్ మరణించారు. కేతన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు సియాలో ఎలాంటి బాధ, దు:ఖం కనిపించలేదని అతని తండ్రి ఆరోపించారు. ఆమె ప్రవర్తనతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఈ ఘటనకు ముందు జూన్ 14న సియా కేతన్ లోహ్‌గఢ్ కోటను సందర్శించారు. ఆ సమయంలో సియా కేతన్‌ను లోయలో పడేయడానికి ప్రయత్నించిందని తండ్రి ఆరోపించారు. అయితే ,కేతన్ చేయి పొదల్లో చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వరస సంఘటనల తర్వాత కుటుంబ సభ్యుల్లో అనుమానం పెరిగింది.
Also Read
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
కేతన్ తండ్రి చెబుతున్న దాని ప్రకారం, తనను ఉద్దేశపూర్వకంగానే తోసినట్లు కేతన్ సియాను అనుమానించాడు. కానీ సియా వెంటనే తేరుకుని పాము..పాము అంటూ అరవడం మొదలుపెట్టింది, అతడిని కాపాడేందుకే తోసినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె నటనను కేతన్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. జూన్ 14 ప్రయత్నం విఫలమైన తర్వాత జూన్ 18న తిరిగి అదే కోట పై నుంచి తోసేసి చంపింది.
తాజావార్తలు
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!