ఇంట్లో ఉండే ఆడవాళ్లకు కాలక్షేపం అంటే ఎక్కువగా సీరియల్స్ అనే చెప్పుకోవాలి.. వాళ్లకు నచ్చిన సీరియల్ వచ్చిదంటే మాత్రం ఎవరు ఏం చెప్పినా.. వారు ఆ సీరియల్ నుంచి బయటికి రారు.. ఇది అందరి ఇళ్లలోనూ ఉండేదే.. కానీ బీహార్ లో ఎన్నికల ఓట్ల కోసం వచ్చిన నాయకులతో ఓ బామ్మ ఓ వింత కోరిక కోరింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా అవాక్కయ్యారు.
Read Also:Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక నుంచి రైలు…
టీవీ సీరియల్ లో ఎక్కువగా యాడ్స్ వస్తున్నాయని.. ఆ నాయకులకు ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది తెగ వైరల్ అవుతుంది. పూణే పర్యటన సందర్భంగా ఆ మహిళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్చంద్ర పవార్, బారామతి ఎంపీ సుప్రియా సులేను కలిసింది. అక్కడ, ఆమె అధికారుల ముందు ఈ విషయాన్ని లేవనెత్తింది.
భారతదేశంలో టీవీ సీరియల్స్‌కు ఫిదా అయిపోయి.. టీవీలకు అతుక్కుపోయి.. డిస్టర్బెన్స్ జరిగితే గొడవలు పడిపోయి.. ఒక్కోసారి కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆడాళ్లు టీవీ సీరియల్స్‌ను ఓన్ చేసుకుని.. ఆ సీరియల్ చూసే టైంలో కుటుంబ సభ్యుల్లో ఎవరు డిస్టర్బ్ చేసినా.. ఫట్టుమని ఒక్కటి వేసేందుకు కూడా వెనుకాడరు.
Read Also:Pepper Spray: నిన్న మొన్నటి దాకా బస్సులోనే అనుకున్నాం.. ఇప్పుడు ట్రైన్ లో కూడానా…
బీహార్‌కు చెందిన ఓ బామ్మ.. తన టీవీ సీరియల్స్‌కు యాడ్స్ ఎలా అడ్డుపడుతున్నాయో.. ఓట్ల కోసం వచ్చిన నాయకులకు చెప్పింది. ఎన్‌సీపీకి చెందిన ఎంపీ సుప్రియా సూలే పూణే రస్తా పేఠ ప్రాంతంలో ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఇక్కడ ఓ బామ్మ.. 30 నిమిషాలు టీవీ సీరియల్ ఉంటే ఇందులో 20 నిమిషాలు యాడ్స్ వస్తాయని.. కథ చూడటానికి ఏం లేదని.. దయచేసి ఈ సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చేయమని కోరింది. ఆమె ప్రాబ్లమ్‌ను చక్కగా విన్న ఎంపీ.. ఏదో ఒకటి చేస్తామని హామీ ఇచ్చింది.
ript>