National Herald case: రాహుల్, సోనియాగాంధీలకు ఈడీ షాక్.. రూ. 752 కోట్ల ఆస్తులు సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన రూ. 90 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అలాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌజ్‌లు, లక్నోలోని నెహ్రూ భవన్ ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్‌కి చెందిన జప్తు చేసిన ఆస్తుల విలువ రూ. 752 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.
పీఎంఎల్ఏ 2002 కింద దర్యాప్తు సంస్థ మనీలాండరింగ్ కేసులో 751.9 కోట్ల విలువైన ఆస్తుల్ని తాత్కాలికంగా అటాచ్ చేయాలని ఈడీ ఉత్తర్వులను జారీ చేసింది. ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలతో పాటు ఇండియాలోని అనేక నగరాల్లోని రూ.661.69 కోట్ల విలువైన స్థిరాస్తులను, ఈక్విటీ షేర్లలో పెట్టుబడి రూపంలో ఉన్న రూ. 90.21 కోట్లను ఈడీ అటాచ్ చేసింది.
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
Read Also: Uttar Pradesh: బెడ్రూం వీడియోలు బయటపెడతానని పోలీసుని బ్లాక్‌మెయిల్ చేసిన భార్య..
దీనిపై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ స్పందించారు. ఈడీ ద్వారా ఏజేఎల్ ఆస్తుల అటాక్‌మెంట్, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి దృష్టిని మరల్చేందుకే అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మనీలాండరింగ్‌కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, రాజకీయ ప్రతీకారం కోసమే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పలుమార్లు ఆరోపించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వార్తా పత్రికను నిర్వహించే అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ కొనుగోలు మోసం, కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ప్రశ్నించింది.
ED has issued an order to provisionally attach properties worth Rs. 751.9 Crore in a money-laundering case investigated under the PMLA, 2002. Investigation revealed that M/s. Associated Journals Ltd. (AJL) is in possession of proceeds of crime in the form of immovable properties…
— ED (@dir_ed) November 21, 2023
తాజావార్తలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!