Money Laundering Case: సీఎం కూతురుపై ఈడీ మనీలాండరింగ్ కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money Laundering Case: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతరు చిక్కుల్లో పడ్డారు. సీఎం కుమార్తె వీణా విజయన్‌తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసినట్లు ఏజెన్సీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఓ మినరల్ కంపెనీ, వీణా విజయన్ సంస్థకు అక్రమ చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు రావడంతో, ఈడీ కేసును నమోదు చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదు చేసిందని, ఈ విషయంపై కేంద్రం దర్యాప్తు చేయాల్సిందిగా కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Kangana ranaut: కంగనా రనౌత్‌పై వ్యాఖ్యల ఫలితం.. సుప్రియా శ్రీనతేకి ఈసీ నోటీసులు..
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
కొచ్చికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీ 2017 మరియు 2018 మధ్య ఎటువంటి సేవలు అందించనప్పటికీ, వీణా విజయన్ యాజమాన్యంలో ఉన్న ఎక్జాలాజిక్ సొల్యూషన్స్‌కి రూ 1.72 కోట్ల చెల్లింపు చేసిందనేది ప్రధాన ఆరోపణ. వీణా విజయన్‌కి ఓ ‘‘ప్రముఖ వ్యక్తి’’తో ఉన్న సంబంధాల కారణంగా సదరు ఖనిజ సంస్థ, వీణా కంపెనీకి నెలవారీ చెల్లింపులు చేసినట్లు పేర్కొంది.
అయితే, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. గత నెలలో కోర్టు ఈ పిటిషన్‌ని కొట్టేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ చేతులకు సంకెళ్లు వేయలేమని కోర్టు పేర్కొంది. జనవరిలో కేరళ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. తన కుమార్తె తన భార్య పదవీవిరమణ డబ్బులతో కంపెనీని ప్రారంభించిందని, తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు.
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!