NTV Telugu Site icon

Priyanka Gandhi: నిన్న పాలస్తీనా.. ఈరోజు బంగ్లాదేశ్.. రోజుకో బ్యాగ్‌తో ప్రియాంక హల్‌చల్

Priyankagandhi

Priyankagandhi

పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ వినూత్న శైలితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పాలస్తీనా అనే పేరును ముద్రించిన బ్యాగ్‌ను తగిలించుకుని హల్‌చల్ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆమె ఖండించారు. ఈ వ్యవహారంపై దుమారం చెలరేగింది. ప్రియాంక తీరును బీజేపీ ఆక్షేపించింది. తాజాగా మంగళవారం కూడా పార్లమెంట్ సమావేశాలకు వస్తూ బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. బంగ్లాదేశ్ బ్యాగ్‌తో ప్రత్యక్షమయ్యారు. ప్రియాంకతో పాటు ప్రతిపక్ష ఎంపీలంతా బంగ్లాదేశ్ బ్యాగ్‌లతో ఐక్యంగా నిరసన తెలిపారు.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. హిందువులు, మైనార్టీలపై దాడులు చోటుచేసుకున్నాయి. వందలాది మంది దాడులకు గురయ్యారు. తాజాగా ఈ దాడులను నిరసిస్తూ.. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవుల పక్షాల నిలబడండి అంటూ బ్యాగ్‌పై రాసుకొచ్చి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక సోమవారం పార్లమెంట్‌ వేదికగా జీరో అవర్‌లో ప్రియాంక మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల అంశాన్ని లేవనెత్తారు. హిందువులు, క్రైస్తవుల భద్రత కోసం ఢాకా దౌత్యవేత్తలతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చించి బాధితులను ఆదుకునేలా చర్చలు జరపాలని ఆమె కోరారు.

ఇది కూడా చదవండి: MLC Kavitha: సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతాం..

ఇక పాలస్తీనాకు మద్దతుగా బ్యాగ్ ధరించడంపై బీజేపీ తప్పుపట్టింది. వయనాడ్ ఎంపీ మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అయితే బీజేపీ ఆరోపణలను ప్రియాంక ఖండించారు. మహిళలు ఏం ధరించాలో బీజేపీ నేతలు డిసైడ్ చేస్తారా? అంటూ నిలదీసింది. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆమె మండిపడ్డారు.

అక్టోబర్ 7, 2023 నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా తీవ్రంగా నష్టపోయింది. చాలా మంది పాలస్తీనీయులు ఆహారం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

Show comments