NTV Telugu Site icon

Priyanka Gandhi: కుంభమేళాపై విపక్షాలకు మాట్లాడే అవకాశమివ్వాలి

Priyankagandhi

Priyankagandhi

మహా కుంభమేళాపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా అవకాశమివ్వాలని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుంభమేళాపై విపక్షాలకు కూడా భావాలు ఉన్నాయని.. రెండు నిమిషాలు మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలని ప్రియాంక కోరారు.

ఇది కూాడా చదవండి: Akshay Kumar : ఫ్లాప్‌ డైరెక్టర్ తో అక్షయ్ కుమార్ సినిమా..?

ఇదిలా ఉంటే మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోడీ కుంభమేళాపై మాట్లాడారు. దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతం అయిందని పేర్కొన్నారు. కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభమేళాతో దేశ ప్రజలను ఐక్యం చేసిందని చెప్పారు. అలాగే భారత శక్తిని ప్రపంచమంతా చూపించామని మోడీ స్పష్టం చేశారు. ఇక కుంభమేళా భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. ఇదొక చారిత్రక ఘట్టమని.. యువత కూడా ఉత్సాహంగా కుంభమేళాలో పాల్గొందని చెప్పారు. మన శక్తి సామర్థ్యాలపై ఉన్న అనుమానాలు.. కుంభమేళాతో పటాపంచలయ్యాయని మోడీ అన్నారు.

ఇది కూాడా చదవండి: Warangal: మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు..

మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగింది. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. దాదాపు రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా కుంభమేళా ముగిసింది. ఈ కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.