NTV Telugu Site icon

PM Modi-Trump: ట్రంప్‌తో మోడీ భేటీపై భారత విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే..!

Trumpmodi

Trumpmodi

ప్రధాని మోడీ ఈనెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారని భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్రీ తెలిపారు. ముందుగా ఫ్రాన్స్‌లో మోడీ పర్యటించనున్నారు. ఈనెల 11న ఫ్రాన్స్‌లో జరిగే ఏఐ సమ్మిట్‌కు మోడీ అధ్యక్షత వహించనున్నారు. 12న పారిస్‌లో జరిగే వీవీఐపీ విందులో మోడీ పాల్గొని.. అమెరికా వెళ్లనున్నారు. ఇక 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించి.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకానున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. చర్చలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు మోడీ అమెరికాలో పర్యటిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Steve Smith: స్మిత్ సెంచరీల పరంపర.. ద్రవిడ్, జోరూట్ రికార్డులు సమం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశాక.. అమెరికాను సందర్శించిన కొద్దిమంది ప్రపంచ నాయకుల్లో మోడీ ఒకరు కానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారని, ప్రవాసులతో సంభాషిస్తారని వెల్లడించారు. అంతేకాకుండా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో పాటు అమెరికా సీనియర్ అధికారులతో కూడా భేటీ కానున్నారు.

ఇది కూడా చదవండి: Ration Rice Benefits: రేషన్ బియ్యం తింటే ఎన్ని లాభాలో తెలుసా?

ట్రంప్ మొదటి పదవీ కాలంలో ప్రధాని మోడీ రెండు సార్లు అమెరికాను సందర్శించారు. రెండో సారి ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక ట్రంప్‌ను అభినందించిన ప్రపంచ నాయకుల్లో మోడీ ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన కొద్దిరోజులకే మోడీకి ఆహ్వానం రావడం కూడా ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అర్థమవుతోంది.