PM Modi: జూలై 2 నుంచి 9 వరకు ప్రధాని మోడీ 5 దేశాల పర్యటన..
- జూలై 2 నుంచి 9 వరకు ప్రధాని 5-దేశాల పర్యటన..
- బ్రెజిల్లో బ్రిక్స్ సమ్మిట్‌కి హాజరుకానున్న మోడీ..
- నమీబియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనాలో పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్లో జరిగి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సౌత్‌లోని అనేక కీలక దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరించేందుకు జూలై 2 నుంచి 9 వరకు 5 దేశాల్లో పర్యటిస్తారు.
ఎనిమిది రోజుల పర్యటనలో ప్రధాని మోడీ బ్రెజిల్‌తో పాటు ఘనా, ట్రినిడాడ్ టొబాకో, అర్జెంటీనా, నమీబియా దేశాలను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పర్యటనలో మొదటి దశలో ప్రధాని మోడీ జూలై 2 నుంచి 3 వరకు ఘనాలో పర్యటిస్తారు. మూడు దశాబ్దాల కాలంలో భారత నుంచి ఘనాకు వెళ్తున్న మొదటి ప్రధానిగా మోడీ రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై చర్చలు జరుగుతాయి.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
జూలై 3 నుంచి 4 వరకు రెండు రోజులు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తారు. 1999 తర్వాత భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో, ప్రధాని మోదీ ట్రినిడాడ్ మరియు టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ మరియు ప్రధానమంత్రి కమ్లా పెర్సాద్-బిస్సేసర్‌తో చర్చలు జరుపుతారు. ఆయన ద్వీప దేశ పార్లమెంటు సంయుక్త సమావేశంలో కూడా ప్రసంగించే అవకాశం ఉంది.
జూలై 4 నుంచి 5మ వరకు అర్జెంటీనాను ప్రధాని మోడీ సందర్శిస్తారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు మరియు గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం మరియు పెట్టుబడి వంటి కీలక రంగాలలో భారతదేశం-అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి అధ్యక్షుడు జేవియర్ మిలేతో ప్రధానమంత్రి విస్తృత చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ తెలిపింది.
దీని తర్వాత బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశానికి వెళ్లనున్నారు. బ్రెజిల్లో జూలై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి హోదాలో ప్రధాని మోదీ బ్రెజిల్‌కు ఇది నాల్గవ పర్యటన అవుతుంది. 17వ బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశం రియో డి జనీరోలో జరుగుతుంది. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం వంటి అంశాలపై భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.
మోడీ చివరగా నమీబియా వెళ్తారు. ఆ దేశ అధ్యక్షుడు నేతుంబో నంది-నదిత్వాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నమీబియా పార్లమెంట్లో కూడా ప్రసంగించనున్నారు.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!