Site icon NTV Telugu

PM Modi: అన్నదాతలే ముఖ్యం.. ట్రంప్ టారిఫ్‌పై తేల్చిచెప్పిన మోడీ

Modi2

Modi2

కేంద్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ విధించిన సుంకాలపై మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి భారీ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘‘మాకు మా రైతుల ప్రయోజనాలే ప్రధానం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై భారతదేశం ఎప్పుడూ రాజీపడదు. దీనికి మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశం దానికి సిద్ధంగా ఉంది.’’ అని మోడీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Tamannaah : ఆ సౌత్‌ స్టార్‌ నాకు క్షమాపణలు చెప్పాడు..

రష్యా ముడి చమురు కొనుగోలు చేయడంతో భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. తొలుత 25 శాతం విధించగా.. తాజాగా జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపించనుంది.

ఇది కూడా చదవండి: Motorola: గ్లామర్ టచ్ తీసుకొస్తున్న మోటరోలా.. కొత్త బ్రిలియంట్ ఎడిషన్ అనౌన్స్!

సుంకాలపై అమెరికా-భారత్‌పై చర్చలు జరిగాయి. కానీ చర్చలు ఫలించలేదు. వ్యవసాయం, పాడి పరిశ్రమపై అమెరికా సుంకాల మినహాయింపు కోరుతోంది. అందుకు భారత్ అంగీకరించడం లేదు. ఈ రెండు కూడా భారతదేశానికి సెంటిమెంట్. అందుకోసం భారతప్రభుత్వం అంగీకారం తెల్పలేదు. దీంతో ఆగస్టు 1న భారత్‌పై 25 శాతం సుంకం విధించారు. అయితే రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. రష్యాతో సంబంధం పెట్టుకున్న ఏ దేశానికైనా ఇదే గతి పడుతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

Exit mobile version