Site icon NTV Telugu

PM Modi: ప్రజల ఆదాయం పెంచుతున్నాం.. జీఎస్టీ సంస్కరణలు నిరంతర ప్రక్రియ

Pmmodi

Pmmodi

జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్‌ల మోత మోగిందని.. 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు. ఎన్డీఏ హయాంలో ప్రజలపై పన్ను భారం తగ్గించామని చెప్పారు. యూపీఏ ఓ గేమ్ ఛేంజర్.. జీఎస్టీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014కు ముందు యూపీఐ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విపక్షాలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజల ఆదాయం, పొదుపులను పెంచామని చెప్పుకొచ్చారు. ఇక్కడితో ఆగబోమని.. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే ఉంటామన్నారు. పన్నులు తగ్గిస్తూనే ఉంటామని.. జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: India: భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం.. రైలు నుంచి నింగికేగిన అగ్ని ప్రైమ్‌

చిప్ నుంచి షిప్ వరకు ప్రతిదీ భారత్‌లోనే తయారు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో తయారయ్యే అన్ని మొబైల్ ఫోన్లలో 55 శాతం యూపీలోనే తయారవుతాయని చెప్పారు. మన దళాలు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాయని తెలిపారు. అందుకోసమే భారతదేశంలో శక్తివంతమైన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అతి త్వరలో రష్యా సహాయంతో ఏర్పాటు చేయబడిన ఫ్యాక్టరీలో ఏకే-203 రైఫిల్స్ తయారీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో రక్షణ కారిడార్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

 

 

Exit mobile version