జమ్మూకాశ్మీర్‌కు సంబందించి 370 అధికరణను రద్ధు చేసిన తరువాత ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు పెద్దసంఖ్యలో టూరిస్టులు వెళ్తున్నసంగతి తెలిసిందే. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రం కోలుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌కు చట్టసభలతో కూడిన యూటీ హోదా ఇవ్వగా, లఢక్ కు మాత్రం చట్టసభలు లేని యూటీగా మార్చారు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన కీలక నేతలతో ఇటీవలే ప్రధానితో సమావేశం నిర్వహించారు. త్వరలోనే జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించాలి నేతలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, వచ్చేవారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమ్మూకాశ్మీర్‌లో పర్యటించబోతున్నారు. మూడు రోజులు ఆయన జమ్మూకాశ్మీర్, లఢక్‌లో పర్యటించే అవకాశం ఉన్నది. ఇక, జులై 26 వ తేదీన కార్గిల్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గోనే అవకాశం ఉన్నది.
Read: చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రి పదవి…?