Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
- సరస్వతి నది ఉండేదా..?
- సంచలనంగా మారిన సైంటిస్టుల రీసెర్చ్..
- గంగా-యమునల మధ్య మరో నదికి ఆనవాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saraswati river: ‘‘సరస్వతి నది’’, పూర్వకాలం భారతదేశంలో ప్రవహించిన పవిత్ర నదిగా పేరుంది. రుగ్వేదంలో సరస్వతి ప్రస్తావన ఉంది. ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవిస్తుందని హిందువుల నమ్మకం. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగరాజ్‌లో గంగా, యమున సంగమ ప్రదేశాన్ని ‘‘త్రివేణి సంగమం’’ గా భావిస్తారు. ఇదే చోట ‘‘సరస్వతి నది’’ కూడా ఈ రెండు నదులతో కలుస్తుందని హిందువుల నమ్మకం.
అయితే, ఈ నమ్మకానికి బలమైన శాస్త్రీయ ఆధారాలను హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తలు గుర్తించారు. గంగా-యమునా నదుల మధ్య ఒకప్పుడు భూగర్బంలో ఒక విశాలమైన ప్రాచీన నది(పాలియోరివర్) ప్రవేశించేదని ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించి కనుగొన్నారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే ‘‘సరస్వతి’’ నది నిజంగా ప్రవహించిందని నమ్ముతున్నవారికి ఇది ఒక శాస్త్రీయ ఆధారాన్ని అందిస్తుంది.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
Read Also: The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు హెలికాప్టర్ సర్వేలు, డ్రిల్లింగ్‌ను (బోరింగ్) ఉపయోగించారు. డాక్టర్ సుభాష్ చంద్ర బృందం గంగా -యమునా దోఆబ్ ప్రాంతంలో భూమికి 10-15 మీటర్ల దిగువన ఒక పెద్ద నదీ లోయను కనుగొంది. ఈ ఆవిష్కరణ పూర్తిగా నిర్ధారించబడిందని ఆయన తెలిపారు. డ్రిల్లింగ్ ద్వారా శాస్త్రీయ ఆధారాలు పొందినట్లు చెప్పారు.
భూగర్భ నది లేదా పురాతన నదీమార్గం 4-5 కిలోమీటర్ల వెడల్పుతో దాదాపు గంగా, యమున నదులంతా పెద్దదిగా ఉండేదని తేలింది. దీని లోతు కూడా రెండు నదుల మాదిరిగానే ఉండేదని, ఇది గంగా-యమునా నదుల పాత ప్రవాహ మార్గం కాదని, ఇది ఒక ప్రత్యేక నదికి సంబంధించినదిగా తేలింది. ఈ నది గంగా-యమునాల పక్కనే ప్రవిస్తోందని తెలిసింది. మొదట్లో 45 కిలోమీటర్లుగా దీని పొడవును అంచనా వేస్తే, ప్రస్తుతం దీని పొడవు కాన్పూర్ వరకు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండటం సైంటిస్టుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది పశ్చిమ దిశగా హిమాలయాల వరకు మరింతగా విస్తరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
సంగమ స్థలంగా భావిస్తున్న ప్రాంతం నుంచి 25 కి.మీ వరకు శాస్త్రవేత్తలు నదిని స్పష్టంగా గుర్తించారు. అయితే, జనాభా విస్తరణ, భవనాల కారణంగా సర్వే చేయడం కష్టంగా మారింది. ఈ ప్రాచీన నది సరస్వతీ నది వర్ణనలతో సరిగ్గా సరిపోతుంది. తాజా పరిశోధనల్ని బట్టి చూస్తే కాలక్రమంలో ఒక పెద్ద నది భూగర్భంలో కలిసిపోయిందనేది స్పష్టంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!