Site icon NTV Telugu

Prashant Kishore: తెల్లవారుజామున ప్రశాంత్ కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిమ్స్‌కు తరలింపు..

Pk

Pk

Prashant Kishore: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ (జేఎస్‌యూపీఏ) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను ఈరోజు (జనవరి 6) తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి పీకేను బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు పోలీసులు. కాగా, ఇక, దీక్ష శిబిరం నుంచి ప్రశాంత్ కిషోర్‌ను నిరాహార దీక్ష స్థలం నుంచి వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో బలవంతంగా తరలిస్తుండగా అతని మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు “వందేమాతరం” నినాదాలు చేస్తుండగానే ప్రశాంత్ కిషోర్ ను పాట్నా పోలీసులు తీసుకెళ్లారు.

Read Also: Megastar : ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, చ‌క్క‌టి ప్ర‌వ‌ర్త‌న కూడా ఉండాలి..

అయితే, అంతకుముందు ప్రశాంత్ కిషోర్ సహా అతని 150 మంది మద్దతుదారులపై పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది చట్టవిరుద్ధమైన ఆందోళన అని చెప్పుకొచ్చారు. పాట్నా హైకోర్టు ఆదేశాల ప్రకారం.. గర్దానీ బాగ్‌లోని నిర్దేశిత స్థలంలో కాకుండా వేరే ప్రదేశంలో ధర్నాను అనుమతించకూడదని తేల్చి చెప్పింది. కానీ, ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదాన్ లో నిరసనకు దిగడంతో అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, డిసెంబర్ 13న BPSC నిర్వహించిన ప్రిలిమినరీ పోటీ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తూ అభ్యర్థులు గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా జన్ సూరాజ్ చీఫ్ పీకే జనవరి 2వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

Exit mobile version