Port workers union: ఇజ్రాయిల్ వెళ్లే నౌకలను నిర్వహించం.. పోర్ట్ వర్కర్స్ యూనియన్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Port workers union: గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్, పాలస్తీనాలకు సైనిక సామాగ్రితో వెళ్లే ఓడల్ని నిర్వహించకూడదని పోర్ట్ వర్కర్స్ యూనియన్ తమ సభ్యులకు పిలుపునిచ్చింది. దేశంలోని 11 ప్రధాన ఓడరేవుల్లో 3500 మందికి పైగా కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటర్ ట్రాన్స్‌పోర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్-పాలస్తీనాలకు సైనిక సామాగ్రిని తీసుకెళ్లే మరే ఇతర దేశం నుమచి ఆయుధ కార్గోలను లోడ్ చేయడం లేదా అన్ లోడ్ చేయడం లేదని తెలిపింది. సైనిక సామాగ్రిని తీసుకెళ్లే షిప్‌లను నిర్వహించవద్దని సమాఖ్య తన సభ్యులకు పిలుపునిచ్చింది.
ఫిబ్రవరి 14న విడుదల చేసిన ఓ ప్రకటనలో ‘‘ఫెడరేషన్ వారు కార్మిక సంఘాల్లో భాగమని, గాజా యుద్ధానికి, మహిళలు, పిల్లల వంటి అమాయక ప్రజలను చంపడానికి ఎల్లప్పుడూ వ్యతిరేకంగా నిలబడతాం’’ అని పేర్కొంది. గాజాలోని ఇజ్రాయిల్ సైనిక దాడుల్ని ఖండించింది. యుద్ధంలో మహిళలు, పిల్లలు చనిపోతున్నారు, ప్రతీ చోటా పేలుతున్న బాంబుల్లో చనిపోయిన వారి పిల్లల్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు అని చెప్పింది.
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
Read Also: Mamata Banerjee: కేంద్రం ఆధార్ కార్డుల్ని డీయాక్టివేట్ చేస్తోంది.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..
యుద్ధంలోని నష్టాన్ని పరిగణలోకి తీసుకుని యూనియన్ సభ్యులమంతా సమిష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. అమాయక ప్రజల ప్రాణాలు తీసే సామర్థ్యాన్ని అందించేందుకు సహాయపడమని చెప్పింది. ఆస్ట్రేలియా, స్పెయిన్ మరియు బెల్జియంతో సహా అనేక ఇతర దేశాలలో వర్కర్స్ యూనియన్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇజ్రాయిల్‌కి పంపే సైనిక పరికరాలను నిర్వహించొద్దని పిలుపునిచ్చాయి.
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడ్డారు. 1200 మంది ఇజ్రాయిలీలను ఊచకోత కోయడంతో పాటు 253 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి తరలించారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్, వెస్ట్ బ్యాంకులపై విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడిలో 28,985 మంది పాలస్తీనియన్లు మరణించగా, 68,883 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
తాజావార్తలు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!