Site icon NTV Telugu

PM Modi: ‘‘రాజకీయ రాబందులు’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆగ్రహం..

Pm Modi

Pm Modi

PM Modi: ఇరాన్ యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు ‘‘రాజకీయ రాబందువులు’’గా ప్రవర్తిస్తున్నాయని, గందరగోళాన్ని రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం అన్నారు. గుజరాత్‌లోని వావ్ థరద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విపక్షాలపై విరుచుకపడ్డారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ సంక్షోభాలను ప్రస్తావిస్తూ.. ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారత్ స్థిరత్వాన్ని కొనసాగించిందని అన్నారు. కష్టసమయాల్లో కలిసికట్టుగా నిలబడాలని సూచించారు.

Read Also: US-Iran War: ట్రంప్‌కు ఉన్న దమ్ము, ఎవరికీ లేదు: అమెరికా రక్షణ మంత్రి..

జాతీయ ఐక్యత కన్నా రాజకీయ బతుకుదెరువు కోసం రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ ముందుందని, దేశాన్ని విభజించాని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు చురుకుగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ భయాన్ని, పుకార్లను సృష్టిస్తోందని అన్నారు. అధికారం కోల్పోవడం వల్లే ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయని, ఢిల్లీలో ఏఐ సమ్మిట్ సభ్యులు నిరాశతో తమ బట్టలు తామే చించుకుంటున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు.

Exit mobile version