Police Complaint Against Rahul Gandhi Over Savarkar Remarks: వీర్ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. మహారాష్ట్రలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో ఆయన వీర్ సావార్కర్ పై కొన్ని వ్యాఖ్యలు చేశాయి. అయితే ఈ వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రేతో పాటు సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీపై శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం నేత వందనా డోగ్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీర్ సావర్కర్ పై వ్యాఖ్యల కారణంగా మహారాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని డొంగ్రే థానే నగర్ పోలీస్ స్టేషణ్ లో గురువారం ఫిర్యాదు చేశారు. ఐసీసీ సెక్షన్లు 500,501 నాన్ కాగ్నిజబుల్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Read Also: Russia-Ukraine War: అంధకారంలో ఉక్రెయిన్.. రష్యా భీకరదాడులు
మహారాష్ట్ర అకోలాలో గురువారం విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారికి క్షమాపణ లేఖ రాసి వీర్ సావర్కర్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లబాయ్ పటేల్ వంటి నేతలకు ద్రోహం చేశారని ఆరోపించారు. సావర్కర్ బ్రిటీష్ వారికి రాసిన లేఖలో ‘‘ సర్, నేను మీకు అత్యంత విధేయుడైన సేవకుడిగా ఉంటానని వేడుకుంటున్నాను’’ అని సంతకం చేశారని, సావర్కర్ బ్రిటీష్ వారికి సహాయం చేశారని, భయంతో లేఖ రాశారని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన పార్టీ గురువారం థానేలో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. తమ ప్రాంత నేతలను కించపరిస్తే ఊరుకునేది లేదని రాహుల్ గాంధీని హెచ్చిరించారు. వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా అన్నారని.. దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా తప్పుపట్టారు.