PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సముద్ర మార్గాల రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన ప్రధాని మోడీ.. పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురైందని పేర్కొన్నారు. అనేక దేశాల్లో ప్రాణనష్టం కూడా సంభవించిందని గుర్తు చేశారు. అమెరికా, ఇరాన్‌లు యుద్ధానికి ముగింపు పలికే అవగాహనకు రావడం సానుకూల పరిణామమని అభివర్ణించారు.
అమెరికా-ఇరాన్ మధ్య గత మూడు నెలలుగా కొనసాగిన ఘర్షణ అంతర్జాతీయ ఆందోళనలకు కారణమైంది. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఈ సంక్షోభం ప్రాంతీయ భద్రత, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా ఇరు దేశాలు శాంతి ప్రతిపాదనపై అంగీకారానికి రావడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు జూన్ 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే హార్మూజ్ జలసంధి మళ్లీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూతపడటంతో అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకోవడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్‌లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
భారత్ ఎప్పటి నుంచో హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగాలని, వివాదాలను సంభాషణలు, దౌత్యపరమైన మార్గాల ద్వారానే పరిష్కరించాలని చెబుతోంది. గత మూడు నెలలుగా ప్రధాని మోడీ పలువురు ప్రపంచ నేతలతో మాట్లాడి ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. శాంతి ఒప్పందం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై వెంటనే కనిపించింది. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 83.89 డాలర్లకు పడిపోయాయి. అంతేకాకుండా భారత స్టాక్ మార్కెట్లలో కూడా భారీ ఉత్సాహం కనిపించింది. సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా లాభపడి ప్రారంభమవగా, నిఫ్టీ కూడా గణనీయంగా పెరిగింది. రూపాయి విలువ కూడా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే బలపడింది. అయితే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం పశ్చిమాసియాలో స్థిరత్వం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కీలక మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
India hopes that the implementation of this understanding will…
— Narendra Modi (@narendramodi) June 15, 2026
తాజావార్తలు
-
LPG Cylinder Price Cut: ఆగస్టు మొదటి రోజే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Astrology: ఆగస్టు 01 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!