PM Modi US Visit: మోడీ అమెరికా పర్యటనను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ కుట్ర.. టూల్ కిట్‌తో ఐఎస్ఐ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్టేట్ విజిట్ కు వెళ్తున్నారు. మోడీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ప్రధాని మోడీకి వైట్ హౌజులో ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీంతో పాటు మోడీ అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య స్నేహంతో పాటు ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడనున్నాయి.
ఇదిలా ఉంటే మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కడుపుమండుతోంది. అక్కడి మీడియా, భారత మీడియా కన్నా ఎక్కువ మోడీ అమెరికా విజిట్ గురించి మాట్లాడుకుంటున్నాయి. భారత్ తమ కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమవ్వడం అక్కడి ప్రభుత్వానికి నచ్చడం లేదు. దీంతో కుట్రలు పన్నుతోంది. మోడీ పర్యటన భగ్నం చేసేందుకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ టూల్ కిట్లను సిద్ధం చేస్తోంది.ప్రధాని మోదీ అమెరికా పర్యటనను వ్యతిరేకిస్తూ ఐఎస్‌ఐ గత కొన్ని రోజులుగా అమెరికాలో చురుగ్గా వ్యవహరిస్తోంది. సమాచారం ప్రకారం, భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రను అమలు చేయడానికి అనేక సంస్థలకు నిధులను కూడా అందించినట్లు తెలుస్తోంది.
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
Read Also: Chennai: చెన్నైలో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవు..
భారత్ పై ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు పెరుగుతున్న నమ్మకంపై పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. దీంతోనే అమెరికాలో వ్యతిరేక ప్రచారానికి సిద్ధం అవుతోంది. దీంతోనే టూల్ కిట్ సిద్ధం చేసుకుంది. దీంట్లో భారత్ ను ఏవిధంగా వ్యతిరేకించాలో, ఏ ప్రదేశాల్లో నిరసన తెలియజేయాలో ఇప్పటికే ప్రణాళికను పాక్ రూపొందించింది. దీనికి సంబంధించిన సన్నాహాలను పూర్తి చేసింది. ఆందోళనకారులను తీసుకెళ్లేందుకు బస్సుల్ని కూడా సిద్ధం చేసింది. భారత్ పై కుట్రలు చేసేందుకు ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించింది. ప్రధాని మోడీని వ్యతిరేకించేందుకు ఇందులో పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తోంది.
ఐఎస్ఐ పర్యవేక్షణల్లో ప్రధాని వెళ్లే మార్గంలో పోస్టర్లను అంటించేందుకు కుట్ర జరుగుతోంది. మోడీ నాట్ వెల్కమ్ హ్యాష్ ట్యాగ్ తో నిరసనలకు పిలుపునిచ్చింది. భారత సైన్యం, భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, మైనారిటీలను అణిచివేస్తోందని ఆరోపణలు చేస్తోంది.
భారత్ కు సంబంధం లేని సంస్థలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. ‘ ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్’ ఈ సంస్థలో ఇండియాకు చెందిన ముస్లింలు తక్కువ, పాకిస్తాన్ ముస్లింలు ఎక్కువ. దీనికి నిధులు ఈజిప్టు నుంచి వస్తాయి. ఉగ్రవాదంతో సంబంధం ఉన్నాయి. ‘యాక్షన్ ఫర్ పీస్’ ఈ సంస్థపై నిధుల దుర్వినియోగంపై కేసులు ఉన్నాయి. ‘వెటరన్ ఫర్ పీస్’ వియత్నాం యుద్ధంలో పాల్గొని రిటైర్ అయిన కొంతమంది సైనికులతో ఏర్పడిన ఈ సంస్థ, భారత్ లో హక్కుల హననం జరుగుతోందని ఆరోపిస్తోంది. అయితే ఇది పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, అమెరికాలోని హక్కుల గురించి మాట్లాడకపోవడం విశేషం. ఇలా పలు సంస్థలు ఐఎస్ఐ నిధులతో మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!