PM Modi: రామేశ్వరంలో మోడీ శ్రీరామనవమి వేడుకలు.. అదే రోజు ‘‘పంబన్’’ వంతెన ప్రారంభం..
- రామేశ్వరంలో ప్రధాని మోడీ రామనవమి వేడుకలు..
- అదే రోజు కొత్త పంబన్ వంతెన ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఏప్రిల్ 06న ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇదే రోజు కొత్త ‘పంబన్ బ్రిడ్జ్’ని ప్రారంభిస్తారు. పంబన్ బ్రిడ్జ్ తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తుంది. సముద్రంలో ఉన్న పాత వంతెన తుప్పు పట్టడంతో 2022లో మూసేశారు. 1914లో నిర్మించిన ఈ వంతెన స్థానంలో కొత్త వంతెన రానుంది.
Read Also: India On USCIRF: మైనారిటీలపై యూఎస్ నివేదిక.. భారత్ తీవ్ర ఆగ్రహం..
Also Read
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ నవంబర్ 2024లో ‘‘భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన’’ అని దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొత్త వంతెన 2.5 కి.మీ పొడవు ఉంది. దీనిని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) రూ. 535 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఇది హైస్పీడ్ రైళ్లు, పెరిగిన ట్రాఫిక్‌కి అనుగుణంగా నిర్మించారు.
హిందీ వివాదం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)పై ఇటీవల కేంద్రం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందీని తమపై రుద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. దీని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని వ్యతిరేకిస్తూ చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో భేటీ జరిగింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గతాయని డీఎంకే ఆరోపిస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలో ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!