టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాపై పాకిస్థాన్ గెలవడంతో మనదేశంలో చాలా మంది విజయోత్సవాలు జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకోగా.. మరికొన్ని చోట్ల స్వీట్లు పంచుకున్నారు. దీంతో ఈ వేడుకలకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు భారతీయులు ఈ వీడియోలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. క్రికెటర్లు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వాళ్లు కూడా స్పందించి తమదైన శైలిలో సెటైర్లు వేశారు. Read Also: ఐక్యరాజ్యసమితిలో డైనోసార్……
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లక్నోలో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఇక కంగనా కూడా బీజేపీ భావజాలానికి మరింత దగ్గర అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె రాజకీయ ప్రవేశం లేకున్నాను, మద్దతు తెలియజేసే అవకాశం కనిపిస్తోంది. యూపీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కంగనా అభినందించారు. ఈ భేటీ…
ప్రధాని మోడీ నేడు అయోధ్య రామాలయ అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ సమీక్షించనున్నారు. ఈ మీటింగ్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆలయ పనులు వేగంగా జరుగుతుండగా.. మందిర నిర్మాణానికి కావాల్సిన నిపుణులు పూర్తిగా అందుబాటులోకి వచ్చారు. సాంకేతికంగా చేయాల్సిన పనులన్నీ పూర్తయ్యాయి. అయితే తాజాగా మోడీ రామాలయ పనులు జరుగుతున్న తీరుపై పూర్తిస్థాయి రివ్యూ చేయనున్నారు. కాగా రామమందిరం నిర్మాణం…