Mumbai: మెట్రో ఫేజ్-3ను ప్రారంభించిన మోడీ.. విద్యార్థులతో ప్రధాని ముచ్చట్లు
- ముంబైలో మెట్రో ఫేజ్-3ను ప్రారంభించిన మోడీ
- విద్యార్థులతో ప్రధాని ముచ్చట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక ముంబైలో మెట్రో లైన్-3ను ప్రారంభించారు. అనంతరం బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. వారితో అనేక విషయాలు ముచ్చటించారు. అంతేకాకుండా ‘లాడ్కీ బహిన్’ పథకం లబ్ధిదారులు, కార్మికులతో కూడా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
మెట్రో రైలుతో పాటు మెట్రో కనెక్ట్-3 యాప్ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీఎం ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్లు ప్రధాని వెంట ఉన్నారు. బీకేసీ- ఆరే మధ్య మొత్తం పది మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, సహర్ రోడ్ సహా మరి కొన్ని ప్రాంతాలను ఈ మార్గం కలుపుతుంది.

ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తోంది. అలాగే ఇండియా కూటమి కూడా అధికారం కోసం ఛేజ్కించుకోవాలని ఆశపడుతోంది. ఈ రెండు కూటమిలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
विद्यार्थी, तरुण, मुख्यमंत्री माझी लाडकी बहिण योजनेचे लाभार्थी आणि मेट्रोची उभारणी करणाऱ्या कामगारांशी संवाद साधून आनंद झाला. pic.twitter.com/Nfi4m2Eb8W
— Narendra Modi (@narendramodi) October 5, 2024
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!