Site icon NTV Telugu

PM Modi: భారతదేశ చరిత్రలోనే ‘‘సిందూర్’’ విజయవంతమైన యాంటీ-టెర్రర్ ఆపరేషన్..

Pm Modi

Pm Modi

PM Modi: పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు భారతదేశ ‘‘నారీ శక్తి’’ని తక్కువగా అంచనా వేసి తమ వినాశనాన్ని కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మహిళల ముందే భర్తల్ని ఉగ్రవాదులు చంపారు. ఈ సంఘటనలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మందిని బలి తీసుకున్నారు. ఉగ్రవాదంపై భారతదేశ చరిత్రలోనే ఆపరేషన్ సిందూర్ అతిపెద్ద విజయవంతమైన చర్యగా ప్రధాని ప్రకటించారు.

Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన సీడీఎస్.. ఏం చెప్పారంటే..

“పహల్గామ్‌లో, ఉగ్రవాదులు కేవలం రక్తం చిందించలేదు, వారు మన సంస్కృతిపై దాడి చేశారు. వారు మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు. ఉగ్రవాదులు భారతదేశ నారీ శక్తిని సవాలు చేశారు. ఈ సవాలు ఉగ్రవాదులకు, వారి స్పాన్సర్లకు శాపంగా మారింది” అని రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్‌లో జరిగిన ‘మహిళా సశక్తికరణ్ మహా సమ్మేళనం’లో పాల్గొన్న ప్రధాని మోదీ అన్నారు.

భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి పాకిస్తాన్‌ని ఆశ్చర్యపరిచిందని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్తాన్‌లోకి వందల కి.మీ చొచ్చుకెళ్లి మరీ వారి శిబిరాలను నాశనం చేశామని చెప్పారు. భారత్‌పై మళ్లీ ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్, దాని ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదుల్ని వారి ఇళ్లలోకి దూరి మరీ చంసేస్తామని చెప్పారు.

Exit mobile version