Site icon NTV Telugu

PM Modi: ఏ రోజైనా అభివృద్ధి గురించి ఆలోచించారా? కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఫైర్

Modi2

Modi2

ఆపరేషన్ సిందూర్ సంకల్పాన్ని బీహార్ భూమి నుంచే తీసుకున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మోతిహరిలో పర్యటించారు. రూ.7,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీపై నిప్పులు చెరిగారు. బీహార్‌లో పేద ప్రజల అభ్యున్నతి గురించి ఆర్జేడీ, కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించాయా? అని ప్రశ్నించారు. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. తూర్పు భారతదేశంలో సమగ్ర అభివృద్ధికి ‘విక్షిత్ బీహార్’ ఎంతైనా అవసరం ఉందని చెప్పారు. యూపీఏ, ఆర్జేడీ ప్రభుత్వాల కాలంలో కేవలం రూ.2లక్షల కోట్ల గ్రాంట్లు మాత్రమే మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను గెలిపిస్తే.. సరికొత్త బీహార్‌ను చూపిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Chhattisgarh: బర్త్ డే రోజు ఈడీ షాక్.. లిక్కర్ కేసులో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్

బీహార్‌లో 3.5 కోట్లకు పైగా మహిళలు బ్యాంకు ఖాతాలు పొందారరని.. గత 1.5 సంవత్సర కాలంలో బీహార్‌లో 24,000 స్వయం సహాయక బృందాలకు సహాయం అందించినట్లు చెప్పారు. 24,000 స్వయం సహాయక సంఘాలకు రూ. 1,000 కోట్లతో సహాయం అందించినట్లు తెలిపారు. నార్వే మొత్తం జనాభా కంటే బీహార్‌కు ఎక్కువ ఇళ్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రధాని ఆవాస్ యోజన కింద నార్వే, న్యూజిలాండ్, సింగపూర్‌ల మొత్తం జనాభా కంటే బీహార్‌కు ఎక్కువ ఇళ్లు ఇచ్చినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Nimisha Priya: యెమెన్‌ వెళ్లేందుకు అనుమతివ్వండి.. కేంద్రాన్ని అడగాలన్న సుప్రీంకోర్టు

ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా పాల్గొన్నారు. ప్రధాని మోడీ నాలుగు కొత్త అమృత్ భారత్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు.

 

 

Exit mobile version