Site icon NTV Telugu

PM Modi: ఖర్గేపై ప్రధాని సెటైర్లు.. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్..

Modi (2)

Modi (2)

PM Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఇటీవల యూరోపియన్ యూనియన్, అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్స్ గురించి సభలో వివరించారు. దేశం అన్ిన రంగాల్లో అభివృ‌ద్ధి చెందుతోందని, గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ గొంతకుగా మారిందని అన్నారు. కాంగ్రెస్ తప్పులు సరిదిద్ధడానికి చాలా సమయం పట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రధానులకు ముందు చూపు లేనందున భారత అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు.

Read Also: T20 World Cup 2026: “బంగ్లాదేశీయులు మా సోదరులు”.. బాయ్‌కాట్ వివాదంపై పాక్ కెప్టెన్..

ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై సెటైర్లు వేశారు. ప్రధాని ప్రసంగంగా ప్రారంభం కాగానే విపక్షాలు నినాదాలు ప్రారంభించాయి. ఆ సమయంలో ఖర్గే తన స్థానంలో నిలబడి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ఖర్గే ఆయన వయసు దృష్ట్యా కూర్చుని నినాదాలు చేయవచ్చు’’ అని సూచించారు. ఇదే సమయంలో మోడీ మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్షాలు అలసిపోయి వెళ్లిపోయాయని ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Exit mobile version