PM Modi: ఎన్‌సిపి (ఎస్‌పి) నాయకురాలు సుప్రియా సూలే కుమార్తె వివాహ విందుకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వంటి వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నేతలు తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ, ప్రియాంకాగాంధీ, ఖర్గేల మధ్య సరదా సంభాషణ జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ‘‘ప్రియాంకా గాంధీ గారు మీరు ఎలా ఉన్నారు.?’’ అని ప్రశ్నించారు. దీనికి బదులుగా ప్రియాంకాగాంధీ ‘‘నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?’’ అని అడిగారు. దీనికి మోడీ స్పందిస్తూ.. ‘‘నేను అంతే’’ అంటూ బదులిచ్చారు. ఇదే సమయంలో ఖర్గే చర్చలోకి చేరి ప్రధాని మోడీతో ‘‘సోదరా మీరు కొంచెం మారారు’’ అని అన్నారు. దీనికి ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘‘అచ్చా’’ అని అన్నారు. దీంతో అక్కడ ఉన్న నేతల మధ్య నవ్వులు విరబూశాయి. దీని తర్వాత ప్రధాని మోడీ అందరికి చేతులు జోడించి అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్లారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ కూడా అక్కడే ఉన్నారు. మోదీ, ఖర్గే మధ్య జరిగిన సంభాషణను విని రాహుల్ కూడా చిరునవ్వుతో కనిపించారు.
ఖర్గే చేసిన ‘మీరు మారిపోయారు’’ అనే వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ సందర్భానుసారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారా అని ఆలోచిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో విద్యార్ధుల నిరసన నేపథ్యంలో ‘‘జెన్ జీ’’ యువతను ఆకట్టుకోవడానికి మోడీ సెల్ఫీ తరహా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేశారు. ఈ ధోరణిపై ఖర్గే అన్నారని భావిస్తున్నారు. మరోవైపు, ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఎస్పీ నేత శరద్ పవార్‌తో మోడీ మాట్లాడుతూ కనిపించారు. ఎన్సీపీ ఎస్పీకి చెందిన ఎంపీలు ఎన్డీయే కూటమిలో చేరుతారనే వార్తలు వినిపించిన నేపథ్యంలో ఈ కలయిక ఆసక్తికరంగా మారింది.
Modiji interacting with Priyanka G & Kharge ji while RaGa stands there like a lost child! pic.twitter.com/q3JO9uSPkm
— 🦋Anjna🦋 (@SaffronQueen_) August 12, 2026

