SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
- SIRపై ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్
- ఇద్దరు ఎన్నికల కమిషనర్లు 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు తెలిపారన్న కథనం
- ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ గాంధీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIR Row: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక సంచలనంగా మారింది. ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు పలు అంశాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలను వ్యతిరేకించారని నివేదిక పేర్కొంది. అయితే, తుది నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల సమ్మతితోనే తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో 14 సార్లు పలు నిర్ణయాలు, విధానాలపై లిఖితపూర్వక అభ్యంరతాలు తెలిపినట్లు వెల్లడించింది. కొత్త ఓట్లర నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు-పునరుద్ధరణ, పునరుద్ధరించిన పేర్లపై ఎన్నికల సంఘం అప్పీళ్లు వేయడంపై ఈ అభ్యంరతాలు ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. కొత్త ఓటర్లకు సంబంధించిన ఫారమ్ -6లో మార్పులు, ఓటర్ల డేటాబేస్ యాక్సిస్‌ను కేంద్రీకరించడం, పేర్ల తొలగింపు-చేర్పుల విధానంపై వీరు ప్రశ్నలు లేవనెత్తినట్లు నివేదించింది.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
ప్రతిపక్షాల విమర్శలు..
ఈ నివేదిక వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష పార్టీలు, నేతలు ఈసీపై విమర్శలు గుప్పించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్నికల సంఘం కలిసి ‘‘దేశద్రోహానికి’’ పాల్పడ్డాయి అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీ భారత ప్రజలపై నేరం, రాజ్యాంగపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారించాలని కోరారు. ఎన్నిలక కమిషన్ సభ్యులు తమ విధుల్ని స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించలేకపోతే అది ప్రజాస్వామ్యానికి ఆందోళనకర పరిణామమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈ నివేదిక ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రభావం చూపిందని అన్నారు. అదృశ్య హస్తం ఎన్నికల సంఘాన్ని నడుపుతోందని ఆరోపించారు. చట్టపరమైన విధానాలు పాటించకపోతే నిర్ణయాల చెల్లుబాటుపై ప్రశ్నలు తలెత్తుతాయని అన్నారు. ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన ప్రక్రియ కూడా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. జ్ఞానేశ్ కుమార్‌తో విపక్ష నేతలు సమావేశమైన సందర్భాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ఎన్నికల సంఘాన్ని “సరిచేయాల్సిన” అవసరం ఉందని చెబుతూ జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఎన్నిక సంఘం సాఫ్ట్వేర్ మార్పుల కారణంగా ఓటర్ల పేర్లు అన్యాయంగా తొలగించబడుతున్నాయని ఆరోపించారు. ఫారమ్-6లో మార్పులకు గెజిట్ నోటిఫికేషన్ లేదని, ఓటర్ల పేర్ల మార్పులు చేర్పుల ప్రక్రియలో అధికారాలు ప్రైవేట్ సంస్థలకు బదిలీ అయ్యాయని ఆరోపించారు.
Vote chori is a crime against the Indian people and a direct attack on our constitution.
The BJP, RSS and EC who organised it have committed an act of treason.
Justice will be served. pic.twitter.com/30kX06CBiH
— Rahul Gandhi (@RahulGandhi) September 23, 2026
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!