Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
- ఫేస్బుక్ పరిచయంతో డాక్టర్‌కు సైబర్ వల
- ట్రేడింగ్ లాభాల పేరుతో కోట్ల రూపాయల పెట్టుబడి
- నకిలీ వెబ్సైట్లు చూసి షాక్‌కు గురైన వైద్యుడు
- అపరిచితుల మాటలు నమ్మొద్దంటున్న సైబర్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ అపరిచిత మహిళ మాయమాటలు నమ్మి ఎర్రగడ్డకు చెందిన 44 ఏళ్ల ప్రముఖ వైద్యుడు ఏకంగా రూ. 14.61 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట అధిక లాభాలు వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు విసిరిన వలకు చిక్కి, విడతలవారీగా కోట్లాది రూపాయల సొత్తును సదరు బాధితుడు అర్పించుకున్నాడు.
ఫేస్బుక్ పరిచయం.. ట్రేడింగ్ పేరిట కోట్లల్లో పెట్టుబడులు
కొద్దిరోజుల క్రితం బాధితుడికి ఫేస్బుక్ (Facebook) వేదికగా ఒక మహిళ పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే అతనితో చనువుగా మాట్లాడుతూ తీవ్రంగా నమ్మించింది. ఆ తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అతి తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో భారీ లాభాలు గడించవచ్చంటూ కొన్ని ట్రేడింగ్ వెబ్సైట్లను సదరు వైద్యుడికి సూచించింది. ఆమె మాటలను నిజమని నమ్మిన బాధితుడు, ఆ మహిళ పంపిన లింకుల ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. ఆయా వెబ్సైట్లలో భారీగా లాభాలు వచ్చినట్లు నకిలీ డిస్ప్లే గణాంకాలు చూపించడంతో, నేరగాళ్ల మాటలు నమ్మి విడతలవారీగా ఏకంగా రూ. 14.61 కోట్ల భారీ మొత్తాన్ని వారిచ్చిన వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేశాడు.
Also Read
నకిలీ వెబ్సైట్లని తేలడంతో షాక్.. హెచ్చరిస్తున్న పోలీసులు
తాను పెట్టిన పెట్టుబడితో పాటు దానికి వచ్చిన లాభాలను తిరిగి విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, ఆయా వెబ్సైట్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సదరు వైద్యుడు దిగ్భ్రాంతి చెందాడు. తాను నమ్మిన వెబ్సైట్లన్నీ నకిలీవని, సైబర్ కేటుగాళ్ల చేతిలో తాను ఘోరంగా మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సోషల్ మీడియాలో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తుల మోసపూరిత మాటలను నమ్మి, అనధికారిక లేదా అపరిచిత వెబ్సైట్లలో ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!