Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తల్లి-కూతుళ్ల మధ్య వచ్చే ఒక కీలక సన్నివేశంపై సోషల్ మీడియాలో తీవ్రమైన అభ్యంతరాలు, ట్రోలింగ్ వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కూతురితో తల్లి వీడియోలు తీయించడం, “నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా” అనే డైలాగ్ విన్న కొందరు ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందిస్తూ, ఆ సన్నివేశం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వెల్లడించారు.
శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. చిన్నతనంలో ఆ అమ్మాయి హీరోయిన్ కావాలనే ఆశతో ఇంట్లోంచి పారిపోయినప్పుడు, తల్లి ఆమెను కొట్టి “నీ మొహానికి యాక్టింగే రాదు.. నిన్నెవడు సినిమాల్లోకి తీసుకుంటాడు?” అంటూ తిడుతుంది. నువ్వు ఓడిపోయి మళ్లీ వెనక్కి వస్తావని తల్లి ముందే చెబుతుంది. ఆ తర్వాత ఎదురైన పరిస్థితుల ప్రభావం వల్ల తల్లి సమక్షంలో కూతురు ఆ విధంగా యాక్టింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. కూతురిలోని అద్భుతమైన ప్రతిభను గుర్తించి, గతంలో తను అన్న మాటలకు వ్యతిరేకంగా “నువ్వు నిజంగానే గొప్ప ఆర్టిస్ట్‌వి” అని ఒప్పుకోవడమే ఆ సన్నివేశం వెనుక ఉన్న అసలు ఆలోచన అని ఆయన వెల్లడించారు. సినిమాలో ఆ ఎమోషనల్ పే-ఆఫ్ బాగున్నప్పటికీ, దానికి సెటప్ తెరపై సరిగ్గా కనెక్ట్ కాలేదని శ్రీకాంత్ ఓదెల అంగీకరించారు. సినిమా లెంత్ సమస్యల కారణంగా ఎడిటింగ్ టేబుల్‌పై ఆ చైల్డ్‌హుడ్ ఎస్టాబ్లిష్మెంట్ సీన్‌ను కట్ చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో అసలు నేపథ్యం తెలియని ఆడియన్స్‌కు.. తల్లి పాత్ర స్వార్థంతో కూతురిని వాడుకుంటున్నట్లు రాంగ్ సిగ్నల్ వెళ్లిందని, ఆ సెటప్ మిస్సవడం వల్లే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని శ్రీకాంత్, నాని స్పష్టం చేశారు. లోపాలను దాచుకోకుండా మేకర్స్ ఇంత నిజాయితీగా వివరణ ఇవ్వడం సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
Also Read
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?