PM Modi: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలువలేకపోయింది. బీహార్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చివరకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ-జేడీయూ కూటమి కైవసం చేసుకుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్‌కు ఒక్క స్థానం దక్కలేదు.
దీనిపై ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఫలితాలను ప్రస్తావిస్తూ, “కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందో ఊహించండి?” అనే ప్రశ్నతో పాటు ఎమోజీని జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన విషయాన్ని ప్రధాని ఎత్తిచూపారు.
నాలుగు రాష్ట్రాల్లోని 28 స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. గతంలో ఆ పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉండేవి. గతంలో ఓడిపోయిన సందర్భంలో కాంగ్రెస్ ఈవీఎంలపై నిందలు వేసేది. ఈ నేపథ్యంలోనే మోడీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని, అయినా కూడా కాంగ్రెస్ గెలవలేదని తన పోస్ట్ ద్వారా చెప్పారు. ఈ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో 11, బీహార్‌లో 8, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 4 శాసన మండలి స్థానాలకు పోటీ జరిగింది.
MLC elections in 28 seats across 4 big states – Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka.
Elections held using ballot papers.
Guess how many seats Congress won? 🧐
— Narendra Modi (@narendramodi) October 28, 2026

