Site icon NTV Telugu

India-Pakistan Tensions: ప్రధాని మోడీతో త్రివిధ దళాధిపతుల భేటీ.. ఈసారి పాక్కి మూడినట్లేనా..?

Modi Chicha

Modi Chicha

India-Pakistan Tensions: భారత్‌- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైయ్యాయి. ఈ పరిణామాల వేళా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (మే 9న) సాయంత్రం త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. డ్రోన్లు, క్షిపణులతో పాక్ దాడులకు తెగబడటం.. భారత్ సైతం వాటిని ధీటుగా తిప్పికొట్టిన తరుణంలో ఈ మీటింగ్ కు ప్రాధాన్యం సంతరించుకుంది.

Read Also: Pawan Kalyan: 96 ఏళ్ల వృద్దురాలితో కలిసి భోజనం చేసిన పవన్.. కారణం ఏంటంటే?

అయితే, ఈ భేటీలో సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు త్రివిధ దళాధిపతులు కూడా హాజరయ్యారు. ఇక, అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, హోం శాఖలోని సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

Exit mobile version