Site icon NTV Telugu

PM Modi: వచ్చే ఏడాది చైనాకు పీఎం మోడీ.. ఇండియాకు రానున్న ట్రంప్, పుతిన్..

Pm Modi

Pm Modi

PM Modi: వచ్చే ఏడాది ప్రపంచంలోనే చాలా ప్రాముఖ్యత కలిగిన దౌత్య పర్యటనలు జరిగే అవకాశం కనిస్తోంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఇప్పుడిప్పుడే రెండు దేశాలు సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు తమ సైన్యాలను వెనక్కి పిలిపించుకునే ఒప్పందం కుదిరింది. ఇటీవల రష్యా కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో చాలా ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంట్ జి జిన్ పింగ్ సమావేశమయ్యారు.

ఇదిలా ఉంటే, 2025లో భారత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు-సెప్టెంబర్ నెలలో చైనాలో జరగబోయే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమ్మిట్ జరుగనుంది. దీని కోసం ప్రధాని చైనాకు వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాకు వెళ్లి, సరిహద్దు సమస్యలతో పాటు పలు అంశాలపై అక్కడి విదేశాంగ మంత్రి వాంగ్ యీతో పాటు ఇతర కీలక నేతలతో చర్చలు జరిపారు. రెండు దేశాలు కూడా తమ సంబంధాలను నార్మల్ చేసుకోవాలని అనుకుంటున్నాయి.

Read Also: SSMB : గుంటూరు కారం రీరిలీజ్.. టికెట్ ముక్క మిగలలేదు

ఇదిలా ఉంటే, మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తుండటంతో, ఇన్ కమింగ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు, అవుట్ గోయింగ్ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో జైశంకర్ చ ర్యలు జరుపుతున్నారు. వచ్చే ఏడాది ప్రధాని నరేంద్రమోడీ హయాంలో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌ కోసం ట్రంప్ భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. క్వాడ్‌లో ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ట్రంప్‌ని కలిసేందుకు పీఎం మోడీ యూఎస్ వెళ్లే అవకాశం ఉందని చెప్పింది.

ఇదిలా ఉంటే, భారత చిరకాల మిత్ర దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్ పర్యటనకు వస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్‌లో అడుగుపెట్టినట్లు అవుతుంది. దీనికి తోడు యూరోపియన్ యూనియన్‌తో భారత శికరాగ్ర సమావేశం కూడా న్యూఢిల్లీలో జరగాల్సి ఉంది. దీనికోసం పలువురు యూరోపియన్ నాయకులు భారత్ రానున్నారు.

జనవరి మధ్యలో సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం భారత్‌లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సియాంటో జొజోహాదికుసుమో భారత్ రానున్నారు. చిలీ అధ్యక్షుడు గాబ్రిల్ బోరిక్ ఫాంట్ కూడా మార్చి లేదా ఏప్రిల్‌లో భారత్ సందర్శించే అవకాం ఉంది. ఫిబ్రవిలో నరేంద్రమోడీ ఫ్రాన్స్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మోడీ జపాన్ వెళ్లే అవకాశం కూడా ఉంది. 2025 చివరి భాగంలో, G20 సమ్మిట్ దక్షిణాఫ్రికాలో మరియు ASEAN సమ్మిట్ మలేషియాలో జరగాల్సి ఉంది. కూటమి సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆయా దేశాలకు వెళ్లవచ్చు.

Exit mobile version