ప్రధాని మోడీ రెండేళ్ల తర్వాత తొలిసారి మణిపూర్‌లో అడుగుపెట్టారు. రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో రాష్ట్రం అట్టుడికింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. భారీ వర్షం మధ్య ప్రధాని మోడీ ఇంఫాల్‌కు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో చురచంద్‌పూర్‌కు వెళ్తున్నారు. రూ.8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Ahmedabad plane crash: ముగిసిన 3 నెలల గడువు.. విమాన ప్రమాదంపై ఎటూ తేల్చని భద్రతా ప్యానెల్
చురచంద్‌పూర్‌లో నిర్వాసితులతో మాట్లాడనున్నారు. అనంతరం రూ.7,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక గురువారం పట్టణంలో కొత్త ఘర్షణలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సిద్ధం చేసిన అలంకరణలను దుండగులు ధ్వంసం చేశారు. ఇక ఇంఫాల్‌లో రూ.1,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ హంతకుడు ఎలా దొరికాడు.. ఎఫ్‌బీఐ సాధించిందేమీ లేదా?
అయితే మోడీ మణిపూర్ పర్యటనపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. తీవ్రమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి పర్యటనలు చేస్తారని ఆరోపించారు. 2023లో 200 మందికి పైగా మరణించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించడానికి మోడీ ఎందుకు వెళ్లలేదని అప్పట్లో విపక్షాలు విమర్శించాయి. తాజాగా ఇన్నాళ్ల తర్వాత మోడీ మణిపూర్‌కు వెళ్లారు.
