Site icon NTV Telugu

PM Modi: కాశ్మీర్‌లో పీఎం మోడీ మెగా ర్యాలీ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాశ్మీర్ వేదిగకా మెగా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అనంత్‌నాగ్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ కాశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కాశ్మీర్‌లో ఈ ఎన్నికల ర్యాలీని నిర్వహించబోతోంది.

Read Also: Heart attack: గుండెపోటుతో భర్త, ఏడో అంతస్తు నుంచి దూకి భార్య.. 24 గంటల్లో రెండు మరణాలు..

అయితే, ఈ ర్యాలీకి సంబంధించి ఖచ్చితమైన తేదీ తెలియనప్పటికీ.. మార్చి 14 నుంచి 17 మధ్య ఏ రోజయినా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్, కుల్గాం, అనంత్‌నాగ్, జమ్మూలోని రాజౌరీ-పూంచ్ ప్రాంతాలతో కూడిన అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానంపై బీజేపీ దృష్టి సారించింది. 2019లో ఈ ఎంపీ స్థానాన్ని నేషనల్ కాన్ఫరెన్స్‌కి చెందిన జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది గెలుచుకున్నారు.

జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో రద్దు చేసిన తర్వాత ప్రధాని తొలిసారిగా కాశ్మీర్ లోయలో పర్యటించనున్నారు. అయితే, గత రెండు నెలల్లో ప్రధాని జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం రెండోసారి. ఫిబ్రవరి 20న జమ్మూలో జరిగిన ఒక బహిరంగ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు, ఈ సందర్భంగా మొత్తం రూ. 32,000 కోట్లకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఆవిష్కరించారు.

Exit mobile version