PM Modi: బంగ్లా నుంచి ప్రధాని మోడీకి ఆహ్వానం.. వెళ్లే అవకాశాలు తక్కువే..
- ఈనెల 17న తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారం..
- ప్రధాని నరేంద్రమోడీకి ఢాకా ఆహ్వానం..
- ఫ్రెంచ్ అధ్యక్షుడి పర్యటన కారణంగా మోడీ వెళ్లే అవకాశాలు తక్కువే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ఈ నెల 17న తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగి ఆ దేశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. రెండేళ్ల అనిశ్చితి తర్వాత, ఆ దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇదిలా ఉంటే, తారిఖ్ ప్రమాణస్వీకారానికి దక్షిణాసియా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు ఆహ్వానం అందింది.
Read Also: Kakinada Road Accident: గూగుల్ మ్యాప్‌లో షాట్ కట్ రూట్‌తో ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
Also Read
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
ప్రధాని నరేంద్రమోడీని ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా ఢాకా అధికారికంగా ఆహ్వానం పలికింది. బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్‌లోని సదరన్ ప్లాజాలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేస్తుందని తెలుస్తోంది.తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి 13 దేశాల ప్రభుత్వాధినేతలను ఆహ్వానించారు. ఆహ్వానితుల జాబితాలో భారతదేశం, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు,భూటాన్ ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ హాజరుకాలేదరని తెలుస్తోంది. ఇప్పటికే, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పర్యటన ఖరారు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రధాని మోడీ స్థానంలో కేంద్రమంత్రుల్లో ఒకరు, భారత ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. యూనస్ పరిపాలన కాలంలో భారత్ బంగ్లా సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి. యూనస్ పాక్ అనుకూల, భారత వ్యతిరేక విధానాల వల్ల రెండు దేశాల మధ్య దౌత్య ఘర్షణ ఏర్పడింది. ఇప్పుడు, తారిఖ్ రెహ్మాన్ పాలనతో సంబంధాలు గాడిన పడే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!