PM Modi: జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడులపై ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్..
- ఉగ్రదాడులపై పీఎం మోడీ అత్యున్నత సమావేశం..
- జమ్మూ కాశ్మీర్ భద్రతపై చర్చ..
- అమిత్ షా- అజిత్ ధోవల్లో భేటీ..
- వరసగా నాలుగు ఉగ్రఘటనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi:జమ్మూ కాశ్మీర్లో వరస ఉగ్రవాదుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో గురువారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని మోడీ అధ్యక్షత జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అధికారులలో జమ్మూకాశ్మీర్ భద్రతా పరిస్థితులను గురించి సమీక్షించారు. తీవ్రవాద వ్యతిరేక చర్యల్ని ప్రధానికి వివరించారు. ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను మోహరించాలని ప్రధాని కోరారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడిన ప్రధాని, కేంద్రపాలిత ప్రాంతంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక యంత్రాంగం చేపడుతున్న చర్యలను మనోజ్ సిన్హా ప్రధానికి వివరించారు.
Read Also: Bandi Sanjay : హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
గత ఆదివారం నుంచి జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఖత్రా నుంచి శివ్ ఖోరీ ఆలయానికి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బస్సు లోయలో పడి 10 మంది మరనించారు. మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలోని సైదా గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు ఇళ్లపై కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టి ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఒక జవాన్ వీర మరణం పొందారు.
మంగళవారం అర్థరాత్రి దోడా జిల్లాలోని చెక్ పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా అధికారులకు గాయలయ్యాయి. ఈ నేపథ్యంలో సమీప ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. దట్టమైన అడవులు, కొండలతో కూడిన ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇదిలా ఉంటే బుధవారం దోడా జిల్లాలో మరోసారి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కైంటర్ జరిగింది. వరసగా మూడు రోజుల వ్యవధిలో నాలుగు ఘటనలు జరగడంతో జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. మరోవైపు భద్రతా బలగాలపై దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది.
PM spoke to HM Amit Shah and discussed the deployment of security forces and counter-terror operations. PM also spoke to J&K LG Manoj Sinha and took stock of the situation in J&K. PM was briefed on the efforts being undertaken by local administration: GoI Sources https://t.co/l8QDMlwwQ4
— ANI (@ANI) June 13, 2024
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!